coronavirus: కరోనాపై అవగాహన

'కరోనా వైరస్' ప్రభావం కారణంగా. . ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి వాతావరణం ఏర్పడింది. ఎక్కడ చూసినా అంతా బంద్ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే సినిమా హాళ్లు, స్కూళ్లు, షాపింగ్ మాల్స్ మూసివేసిన పరిస్థితి దాపురించింది.

Last Updated : Mar 14, 2020, 01:34 PM IST
coronavirus: కరోనాపై అవగాహన

'కరోనా వైరస్' ప్రభావం కారణంగా. . ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి వాతావరణం ఏర్పడింది. ఎక్కడ చూసినా అంతా బంద్ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే సినిమా హాళ్లు, స్కూళ్లు, షాపింగ్ మాల్స్ మూసివేసిన పరిస్థితి దాపురించింది. అంతే కాదు కనీసం ఇంట్లో పెళ్లిళ్లు లేదా ఇతర శుభకార్యాలు చేసుకోవాలన్నా జనం భయ పడే పరిస్థితికి వచ్చారు. 

Read Also: అప్పుడే పుట్టిన బిడ్డకు కరోనా వైరస్..!!

ఈ క్రమంలో 'కరోనా వైరస్' గురించి భయపడి.. వ్యాధి విస్తరించకుండా అన్ని ప్రాంతాల్లో స్కూళ్లు మూసేస్తున్నారు. ఐతే కరోనా వైరస్  గురించి భయపడవద్దు.. అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెన్నైలోని ఓ ప్రయివేట్ స్కూలు విద్యార్థులు ప్రచారం చేస్తున్నారు. చిన్నారి చేతులతో ముద్దుముద్దుగా అవగాహన కల్పిస్తున్నారు. చెన్నైలోని ఎవర్ విన్ విద్యాశ్రమ్ స్కూల్ విద్యార్థులు.. పాఠశాల ఆవరణలో పెద్ద చిత్రాన్ని వేశారు. "వాష్ హ్యాండ్స్.. లివ్ లాంగ్.." అని రాశారు. ఆ పెద్ద చిత్రాన్ని వారు 25 వేల సబ్బులతో వేయడం విశేషం.  అంతే కాదు ఆ పెయింటింగ్ చుట్టూ మానవ హారంగా నిలబడి.. 'కరోనా వైరస్' జాగ్రత్తలపై విద్యార్థులు అవగాహన కల్పించారు.

 Read Also:  హ్యాండ్ శానిటైజర్ ఇంట్లో తయారు చేయడం ఎలా..?  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News