coronavirus: అప్పుడే పుట్టిన బిడ్డకు కరోనా వైరస్..!!

అభం.. శుభం.. తెలియని.. ఆ శిశువు..  అప్పుడే ఈ పాడు లోకంలోకి అడుగుపెట్టింది. కనీసం కనుగుడ్లయినా తెరవక ముందే.. కఠిన రాక్షసి 'కరోనా వైరస్' బారిన పడింది. పుట్టగానే... మృత్యువు వెంటాడుతున్న ఆ శిశువును చూసి అంతా అయ్యో పాపం అంటున్నారు.

Last Updated : Mar 14, 2020, 12:39 PM IST
coronavirus: అప్పుడే పుట్టిన బిడ్డకు కరోనా వైరస్..!!

అభం.. శుభం.. తెలియని.. ఆ శిశువు..  అప్పుడే ఈ పాడు లోకంలోకి అడుగుపెట్టింది. కనీసం కనుగుడ్లయినా తెరవక ముందే.. కఠిన రాక్షసి 'కరోనా వైరస్' బారిన పడింది. పుట్టగానే... మృత్యువు వెంటాడుతున్న ఆ శిశువును చూసి అంతా అయ్యో పాపం అంటున్నారు.  

లండన్ లో పుట్టిన ఆ శిశువు దురదృష్టానికి అంతా జాలి చూపించడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. దేవుడా..  ఆ బిడ్డ ఏం తప్పు చేసిందని ఇంత భారీ శిక్ష వేశావని ప్రశ్నిస్తున్న వారే ఎక్కువగా కనిపిస్తున్నారు.  మహమ్మారి కరోనా వైరస్ బారిన పడ్డ ఆ శిశువు ఇప్పుడు అతి పిన్న వయసున్న బాధితురాలిగా నమోదైంది. మిడిల్ సెక్స్ లో ఓ నిండు గర్భిణీ కొద్ది రోజుల క్రితమే న్యూమోనియా జ్వరంతో ఆస్పత్రిలో చేరింది. ఆమెకు కరోనా వైరస్ పరీక్ష చేయగా.. పాజిటివ్ గా నివేదిక వచ్చింది. ఆ తర్వాత ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. కానీ కొద్ది నిముషాల తర్వాత వైద్యులు ..  ఆ పుట్టిన శిశువుకు కూడా కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆమెకు కూడా కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దాంతో తల్లీ, కూతుళ్లను ఇద్దరినీ వేర్వేరు ఆస్పత్రులలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

Read Also:  హ్యాండ్ శానిటైజర్ ఇంట్లో తయారు చేయడం ఎలా..?

అప్పుడే పుట్టిన శిశువుకు రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఆ బిడ్డ పరిస్థితి ఏంటనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు బిడ్డ.. తల్లి గర్భంలో ఉండగానే కరోనా వైరస్ సోకిందా..? లేదా పుట్టేటప్పుడు కరోనా వైరస్ దాడి చేసిందా..? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఆ బిడ్డకు ఏమీ కావొద్దని అంతా కోరుకుంటున్నారు. మరోవైపు చైనాలోని ఇలాంటి ఘటనే ఒకటి జరిగిందని ప్రచారం జరుగుతోంది. 

ఇప్పటి వరకు కరోనా వైరస్ మహమ్మారి 114 దేశాల్లో ప్రభావం చూపిస్తోంది. మొత్తంగా లక్షా 40 వేల మంది పాజిటివ్ లక్షణాలతో బాధపడుతున్నారు. ఇప్పటి వరకు 5 వేల మందికి పైగా మృతి చెందారు. అందులో ఒక్క చైనాలోనే 3 వేల మంది మృతి చెందారు.Read Also: ట్రంప్‌పై కరోనా ఎఫెక్ట్ ..!!  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 

Trending News