sanitizer making : హ్యాండ్ శానిటైజర్ ఇంట్లో తయారు చేయడం ఎలా..?

'కరోనా వైరస్' కారణంగా ఇప్పుడు ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన విపరీతంగా పెరిగింది. కరోనా వైరస్ రావద్దంటే. .  ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని వైద్యులు, ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ముక్కుకు మాస్క్‌లు ధరించాలని కూడా ప్రచారం చేస్తున్నాయి.

Last Updated : Mar 14, 2020, 10:34 AM IST
sanitizer making : హ్యాండ్ శానిటైజర్ ఇంట్లో తయారు చేయడం ఎలా..?

'కరోనా వైరస్' కారణంగా ఇప్పుడు ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన విపరీతంగా పెరిగింది. కరోనా వైరస్ రావద్దంటే. .  ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని వైద్యులు, ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ముక్కుకు మాస్క్‌లు ధరించాలని కూడా ప్రచారం చేస్తున్నాయి.  దీంతో మాస్క్‌లు,  శానిటైజర్‌ల కోసం మెడికల్ షాపుల వద్దకు జనం పరుగులు తీస్తున్నారు. కానీ ఎక్కడా మాస్క్‌లు, హ్యాండ్ శానిటైజర్‌లు దొరకని పరిస్థితి నెలకొంది.  

పనిలో పనిగా వ్యాపారులు కూడా కరోనా వైరస్ ఎఫెక్ట్‌ను క్యాష్ చేసుకుంటున్నారు. మాస్క్‌లు, హ్యాండ్ శానిటైజర్లకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. అందిన కాడికి ప్రజల వద్ద దోచుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే జనం భయాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఐతే హ్యాండ్ శానిటైజర్‌ను ఇంటి వద్ద తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా..?

Read Also: ట్రంప్‌పై కరోనా ఎఫెక్ట్ ..!!
 

అవును.. మీరు విన్నది నిజమే. . మార్కెట్లో దొరికే వస్తువులను తీసుకువచ్చి ఇంట్లోనే హ్యాండ్ శానిటైజర్ తయారు చేసుకోవచ్చని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన టీమ్ తో కలిసి చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ..WHO ప్రమాణాల ప్రకారం ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియో చూసి మీరూ తెలుసుకోండి.

 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News