'ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పనిదినాలు కల్పించండి': సీఎంని కోరిన మంత్రి

'వారంలో ఐదు రోజుల పనిదినాలు'

Last Updated : Oct 2, 2018, 12:32 PM IST
'ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పనిదినాలు కల్పించండి': సీఎంని కోరిన మంత్రి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి ఐదురోజులే పనిదినాలు కల్పించాలని కర్ణాటక రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే ముఖ్యమంత్రి  హెచ్ డీ కుమారస్వామిని కోరారు.

'రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాలు కల్పించే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది. ఈ చర్య వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పని సామర్థ్యం పెరుగుతుంది' అని ముఖ్యమంత్రి కుమారస్వామికి రాసిన లేఖలో మంత్రి ప్రియాంక్ ఖర్గే పేర్కొన్నారు. రాష్ట్రం నలుమూలల నుండి ప్రభుత్వ ఉద్యోగుల నుంచి తనకు ఈ విధమైన డిమాండ్లే వస్తున్నట్లు ఖర్గే తెలిపారు. ముఖ్యమంత్రికి ఖర్గే ఆగస్టు 29న ఈ లేఖ రాశారు. కానీ సోమవారం ఈ లెటర్ మీడియాకి తెలిసింది. ఇటీవలే ఖర్గే ప్రభుత్వ అధికారులను హెచ్చరించడంతో వార్తల్లో నిలిచారు.

అటు కర్ణాటక మంత్రివర్గ విస్తరణ ఈ నెల 10 లేదా 12వ తేదీనాటికి పూర్తవుతుందని ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి చెప్పారు. మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ కొనసాగుతోందని ఆయన సోమవారం అన్నారు.

Trending News