New Rules: ఏప్రిల్ 1 నుంచి మారుతున్న కొత్త నిబంధనలు ఇవే..కొంత నష్టం..కొంత లాభం

New Rules: ప్రతి యేటా నిత్య జీవితంలో వివిధ పనులకు సంబంధించి నిబంధనలు మారుతుంటాయి. ఇప్పుడు మార్చ్ నెల ముగుస్తోంది. కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపధ్యంలో మారుతున్న నిబంధనలేంటనేది తెలుసుకుందాం..  

Last Updated : Mar 30, 2022, 10:20 AM IST
 New Rules: ఏప్రిల్ 1 నుంచి మారుతున్న కొత్త నిబంధనలు ఇవే..కొంత నష్టం..కొంత లాభం

New Rules: ప్రతి యేటా నిత్య జీవితంలో వివిధ పనులకు సంబంధించి నిబంధనలు మారుతుంటాయి. ఇప్పుడు మార్చ్ నెల ముగుస్తోంది. కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపధ్యంలో మారుతున్న నిబంధనలేంటనేది తెలుసుకుందాం..

ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్దిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపధ్యంలో బ్యాంకింగ్ రంగంలో కొత్త మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ఆదాయపు పన్ను, వస్తు, సేవల పన్ను విషయాల్లో పలు మార్పులు జరగనున్నాయి. కొన్ని అనుకూలంగా ఉంటే..మరికొన్ని ప్రతికూలంగా ఉండనున్నాయి. ఏయే నిబంధనలు ఎలా మారుతున్నాయో ఓసారి పరిశీలిస్తే మంచిది. లేకపోతే నష్టాలు ఎదుర్కోవల్సి వస్తుంది. 

బ్యాంకుల్లో ఏప్రిల్ 1 నుంచి పాజిటివ్ పే సిస్టమ్ అమలు చేయనున్నామని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రకటించింది. అంటే కస్టమర్ వెరిఫికేషన్ లేకుండా పాజిటివ్ పే సిస్టమ్ ప్రకారం చెక్ పేమెంట్లు ఇకపై జరగవు. పది లక్షలకు పైనున్న నగదు చెక్కులకు ఈ నిబంధన తప్పనిసరి చేసింది ఆర్బీఐ. సేవింగ్స్ ఎక్కౌంట్లలో కనీస పరిమితి 10 వేల నుంచి 12 వేలకు పెంచుతోంది యాక్సిస్ బ్యాంక్. 

ఇక ఐటీ రిటర్న్స్ విషయంలో తప్పులు జరిగితే పన్ను చెల్లింపుదారులు అప్‌డేటెడ్ రిటర్న్స్ దాఖలు చేయాలి. సంబంధిత ఏడాది ముగిసిన రెండేళ్లలోపు ఈ వెసులుబాటు వర్తిస్తుంది. ఇక ఎన్‌పీఎస్ కోతల విషయంలో మరో మార్పు రానుంది. కేంద్ర ప్రభుత్వం తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా డీఏలో 14 శాతం వరకూ ఎన్‌పీఎస్ నిధి కోసం సెక్షన్ 80 సీసీడీ 2 ప్రకారం క్లెయిమ్ చేసుకోవచ్చు. పీఎఫ్ ఖాతాపై పన్ను కొత్తగా చేరుతుంది. ఐటీ నిబంధన 25వ సవరణ ప్రకారం..పీఎఫ్ ఖాతాల్లోకి చేరే 2.5 లక్షల డబ్బు వరకే పన్ను ఉండదు. ఇది దాటితే వడ్డీ ఆదాయంపై పన్ను వర్తిస్తుంది. 

క్రిప్టో పన్ను కొత్తగా వస్తోంది. దేశంంలో 30 శాతం పన్ను, 1 శాతం టీడీఎస్ పడనుంది. దీనికి నష్టాలతో సంబంధం లేదు. క్రిప్టోకరెన్సీపై వచ్చే లాభాలపై పన్ను కచ్చితంగా చెల్లించాల్సిందే. ఇక పోస్టాఫీసు పథకాలకు సంబంధించి మార్పులు రానున్నాయి. ముఖ్యంగా టైమ్ డిపాజిట్ ఎక్కౌంట్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, నెలసరి ఆదాయ పథకాల్లో పెట్టుబడులు పెట్టాలంటే బ్యాంక్ ఎక్కౌంట్ తప్పనిసరి. స్మాల్ సేవింగ్స్‌లో డిపాజిట్ చేసే మొత్తాలపై వడ్డీ ఏప్రిల్ 1 నుంచి విడిగా సేవింగ్స్ ఎక్కౌంట్లలో జమవుతుంది. 

ప్రతి నెలా 1వ తేదీన పెరిగినట్టే ఈసారి కూడా ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధర పెరగవచ్చు. గ్యాస్ సిలెండర్‌పై 50 రూపాయలు ఇప్పటికే పెరిగింది. ఇక ఏప్రిల్ 1 వ తేదీ నుంచి కొన్ని రకాల మందుల ధరలు పెరగనున్నాయి.. పది శాతం వరకూ పెరగవచ్చని తెలుస్తోంది. కోవిడ్ చికిత్సకు అవసరమయ్యే ఖర్చులపై పన్ను మినహాయింపు పొందవచ్చు. 

Also read: Rana Ayyub: రాణా అయ్యూబ్‌కు షాక్, ముంబై విమానాశ్రయంలో నిలిపివేత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News