Rana Ayyub: రాణా అయ్యూబ్‌కు షాక్, ముంబై విమానాశ్రయంలో నిలిపివేత

Rana Ayyub: ప్రముఖ జర్నలిస్ట్ రాణా అయ్యూబ్‌కు పరాభవం ఎదురైంది. లండన్ ఫ్లైట్ ఎక్కకుండా నిలిపేశారు. ఇంటర్నేషనల్ జర్నలిజం ఫెస్టివల్‌కు ఆమె లండన్ వెళ్లాల్సి ఉంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 30, 2022, 08:28 AM IST
Rana Ayyub: రాణా అయ్యూబ్‌కు షాక్, ముంబై విమానాశ్రయంలో నిలిపివేత

Rana Ayyub: ప్రముఖ జర్నలిస్ట్ రాణా అయ్యూబ్‌కు పరాభవం ఎదురైంది. లండన్ ఫ్లైట్ ఎక్కకుండా నిలిపేశారు. ఇంటర్నేషనల్ జర్నలిజం ఫెస్టివల్‌కు ఆమె లండన్ వెళ్లాల్సి ఉంది. 

గుజరాత్ ఫైల్స్ పుస్తకంతో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ప్రముఖ జర్నలిస్టు రాణా అయ్యూబ్‌కు మరోసారి షాక్ తగిలింది. లండన్ విమానం ఎక్కకుండా ముంబై విమానాశ్రయంలో నిలిపేశారు. వాషింగ్టన్‌కు చెందిన నాన్-ప్రాఫిట్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జర్నలిస్ట్స్, మహిళా జర్నలిస్టులపై ఆన్‌లైన్ దాడుల‌పై చర్చ కోసం అయ్యూబ్‌ను యూకే నుంచి ఆహ్వానించింది. ఇందులో రాణా అయ్యూబ్.. జ‌ర్న‌లిస్టులు ఎదుర్కొంటున్న‌ ట్రోల్స్, ఆన్‌లైన్ వేధింపులు  బెదిరింపులపై ప్ర‌సంగించాల్సి ఉంది. ఈడీ ఆమెపై జారీ చేసిన లుక్ అవుట్ నోటీసు కారణంగా ఆమెను ఫ్లైట్ ఎక్కకుండా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. 

రాణా అయ్యూబ్‌పై మనీ లాండరింగ్ ఆరోపణలున్నాయి. ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా రాణా అయ్యూబ్ స్పందించింది. భారత ప్రజాస్వామ్యంపై కీలకమైన ప్రసంగమిచ్చేందుకు అంతర్జాతీయ జర్నలిజం ఫెస్టివల్‌కు వెళ్తున్నాను. ఈ ఫెస్ట్‌లో కీలకోపన్యాసం ఇచ్చేందుకు ఇటలీ వెళ్లాల్సి ఉంది. ఆ ఫెస్ట్‌లో నా ప్రసంగం ఉండకూడదనే ఉద్దేశ్యంతో లండన్ ఫ్లైట్ ఎక్కుతుండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆపేశారు. లుక్ అవుట్ నోటీసులు మెయిల్‌కు వచ్చాయి. నీకేం భయం అంటూ ఆమె ట్వీట్ చేసింది.

రాణాపై ఉన్న ఆరోపణలు

కరోనా కష్టకాలంలో సేకరిస్తున్నప్పుడు విదేశీ నిధుల నిబంధనల్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది ఏప్రిల్ 1వ తేదీన విచారణకు పిలిచింది. 2020-21 మధ్యకాలంలో కెట్టో అనే ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా 2.69 కోట్లకు పైగా విరాళాలు సేకరించిందని..నిబంధనలు ఉల్లంఘించారని గుర్తించారు. అయితే కెట్టో ద్వారా సేకరించిన ప్రతి పైసాకు లెక్క ఉందని..ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదని వెల్లడించింది. అయితే పూర్తిగా ముందస్తు ప్రణాళికతో, క్రమపద్ధతిలో స్వచ్ఛంధ సంస్థ పేరుతో నిధులు సేకరించారని..సేకరించిన ప్రయోజనం పూర్తిగా ఉపయోగించలేదని ఈడీ స్పష్టం చేసింది. 

Also read: Rajasthan: రాజస్తాన్ టైగర్ రిజర్వ్‌లో కార్చిచ్చు.. తగలబడుతున్న అడవి.. రంగంలోకి ఎయిర్‌ఫోర్స్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News