కాశ్మీర్‌లో కల్లోలం: బాలిక, ముగ్గురు యువకులు మృతి

జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి

Last Updated : Jul 7, 2018, 09:18 PM IST
కాశ్మీర్‌లో కల్లోలం: బాలిక, ముగ్గురు యువకులు మృతి

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. శనివారం కుల్గామ్‌ జిల్లాలోని ఖుద్గాం ప్రాంతంలో భద్రతా దళాలపైకి నిరసనకారులు రాళ్లు రువ్వారు. వారిని అదుపుచేసే క్రమంలో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. జవాన్ల కాల్పుల్లో ఓ మైనర్ బాలికతో పాటు ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోగా.. అనేకమందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.

శనివారం ఉదయం కార్డన్‌ సెర్చ్‌ చేపట్టిన భద్రతా బలగాలు.. ఉగ్రవాదుల కోసం గాలిస్తూ కుల్గాంలోని ఖుద్గాం ప్రాంతానికి చేరుకున్నారు. వారిని అడ్డుకునే క్రమంలో నిరసనకారులు రాళ్లదాడికి తెగబడ్డారు. దీంతో బలగాలు కాల్పులు జరిపారు. మృతులను మహమ్మద్ హుస్సేన్ (20), ఇర్షద్‌ మాజిద్‌(20), అంద్లీబ్‌ జాన్ (15)గా గుర్తించారు. మృతులు రెడ్వానిలోని హవూరా గ్రామానికి చెందినవారని తెలిసింది. ఘటన తరువాత పుకార్లు చెలరేగకుండా అదుపుచేసేందుకు ముందస్తుగా ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. అల్లర్లు చెలరేగకుండా ఉండేందుకు కుల్గామ్‌ జిల్లాల్లో బలగాలను భారీ ఎత్తున్న మోహరించి పరిస్థితిని ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు.

Trending News