Ujjain Marriage: పెళ్లి కూతుళ్లను మార్చిన కరెంట్..ఏమిటా కథ..!

Ujjain Marriage: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని పెద్దల మాట. ప్రస్తుతం ఆ ట్రెండ్ మారినట్లు కనిపిస్తోంది. పెళ్లిళ్లకు నిమిషం ముందు పరిస్థితులు మారిపోతున్నాయి. అలాంటి ఘటనలు నిత్యం చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోనూ విచిత్రమైన ఘటన జరిగింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 9, 2022, 08:34 PM IST
  • ఉజ్జయినిలో అనుకోని ఘటన
  • కరెంట్ పోవడంతో సీన్ రివర్స్
  • సమస్యను పరిష్కరించుకున్న ఇరు కుటుంబాలు
Ujjain Marriage: పెళ్లి కూతుళ్లను మార్చిన కరెంట్..ఏమిటా కథ..!

Ujjain Marriage: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని పెద్దల మాట. ప్రస్తుతం ఆ ట్రెండ్ మారినట్లు కనిపిస్తోంది. పెళ్లిళ్లకు నిమిషం ముందు పరిస్థితులు మారిపోతున్నాయి. అలాంటి ఘటనలు నిత్యం చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోనూ విచిత్రమైన ఘటన జరిగింది. 

మధ్యప్రదేశ్‌లో ఉజ్జయినికి చెందిన రమేష్‌ లాల్‌కు నికిత, కరిష్మా అనే ఇద్దరు కుమార్తెలున్నారు. వీరికి ఇటీవలే పెళ్లి కుదిరింది. వేర్వేరు కుటుంబాలకు చెందిన బోలా, గణేష్‌తో వివాహం జరిపించేందుకు నిర్ణయించారు. ఒకే ముహూర్తానికి వారికి పెళ్లి చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం పెళ్లి జరుగుతున్న సమయంలో అనుకోని ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారి కరెంట్ పోయింది. దీంతో మొత్తం కథ అడ్డం తిరిగింది. 

మొత్తం చీకట్లు కమ్ముకోవడంతో పెళ్లి కొడుకులు తారుమారు అయ్యారు. చెల్లెలి కాబోయే భర్త ఆమె అక్కను మనువాడాడు. అక్కకు పెళ్లి చేసుకోవాల్సిన వరుడు ఆమె చెల్లికి తాళి కట్టాడు. ఐతే ఈ విషయాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు. పురోహితుడు సైతం గమనించకుండా పెళ్లి తంతును పూర్తి చేశాడు. అప్పగింత సమయంలో అసలు విషయం బయట పడింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ తలెత్తింది. పెద్దల సమక్షంలో ఇరు కుటుంబాలు సమస్యను పరిష్కరించుకున్నట్లు తెలుస్తోంది. మళ్లీ పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

Also read:Mahesh babu comments on Ministry : తనకు హెల్త్ మినిస్త్రీ కావాలంటున్న మహేశ్

Also read:Pulses For In High Cholesterol: కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏ పప్పులు తినాలి..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News