Mahesh babu comments on Ministry : తనకు హెల్త్ మినిస్త్రీ కావాలంటున్న మహేశ్

Sarkaaru Vaari Paata :  రెండున్నరేళ్ల తర్వాత మహేశ్‌బాబు ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా యాంకర్ సుమకిచ్చిన ఇంటర్వ్యూలో చాలా విశేషాలు పంచుకున్నారు సూపర్ స్టార్ మహేశ్‌బాబు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 9, 2022, 06:43 PM IST
    • సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట'
    • మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల
    • సుమ ఇంటర్వ్యూలో తనకు ఏ మినిస్ట్రీపై ఆసక్తి ఉందో చెప్పిన మహేశ్
Mahesh babu comments on Ministry : తనకు హెల్త్ మినిస్త్రీ కావాలంటున్న మహేశ్

Sarkaaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ మూవీ కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం యాక్షన్‌ అండ్ కామెడీ ఎంటర్ టైనర్‌గా తీర్చిదిద్దిన సర్కారు వారి పాట మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

రెండున్నరేళ్ల తర్వాత మహేశ్‌బాబు ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా యాంకర్ సుమకిచ్చిన ఇంటర్వ్యూలో చాలా విశేషాలు పంచుకున్నారు సూపర్ స్టార్ మహేశ్‌బాబు. తనకున్న ఫ్యాన్ బేస్ తన అదృష్టమన్నారు. నాన్న గారి అభిమానులు ఇప్పటికీ అభిమానించటం, రాజకుమారుడు సినిమా నుంచి వాళ్లు చూపించిన అభిమానం మరవలేనిదన్నారు మహేశ్. ట్రైలర్ రిలీజ్ రోజే అభిమానుల హంగామాతో వచ్చిన ఎనర్జీ అమేజింగ్ అన్నారు మహేష్‌బాబు.

"అప్పుడు పారిస్‌లో ఉన్నా. భ్రమరాంబకి డైరెక్టర్ వాళ్లంతా వెళ్లారు. ఏంటది అనడిగితే అక్కడ మా వాళ్లు నాకు చూపించారు. షాక్ అయ్యాను. అలా రెస్పాన్స్ చూశాక ఫీలింగ్ మాటల్లో చెప్పలేనంతగా అనిపించింది. వాళ్ల అభిమానం మరిచిపోలేనిది." -మహేశ్‌బాబు

గ్లామర్ గురించి ఎవరైనా అడిగితే చిరాకు అనిపిస్తోందా.. అని సుమ అడగ్గా... అలాంటిదేం లేదు అన్నారు. అలా అడిగితే బాగుంటదన్నారు మహేశ్‌. వెంటనే సుమ అందుకుని.. మెయింటైన్ చేయటానికి దూల తీరిపోతుందంటున్నారు. యు ఆర్ బార్న్ హేండ్సమ్ కదా అంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది. ఆ డైలాగ్ గురించి మహేశ్ మాట్లాడుతూ... అది నా ఫేవరైట్ డైలాగ్స్‌లో ఒకటి. ఎలా రాశారు అని పరుశురామ్‌ను అడిగా. అదేనండీ... కథ చెప్పేటప్పుడు మిమ్మల్ని చూశాను. తెల్లగా భలే అనిపించారు. అందుకే అలా డైలాగ్ రాయాలనిపించింది. అలా వచ్చేసింది అన్నారని మహేష్ చెప్పుకొచ్చారు.

ఈ ఇంటర్వ్యూలో సుమ వేసిన కొన్ని సరదా ప్రశ్నలు ఆకట్టుకున్నాయి. అందులో భాగంగా ఏయే మంత్రిత్వ శాఖలు ఎవరికి కేటాయిస్తారో చెప్పాలంటూ ప్రశ్నించింది. హెల్త్ మినిస్ట్రీ ఎవరికిస్తే బాగుంటుంది అని అడగ్గానే... హెల్త్ మినిస్ట్రీ అయితే నాకే కావాలి అంటూ మహేశ్‌బాబు టక్కున సమాధానమిచ్చారు. ఇక మహేష్ రిప్లైకి సుమ మైదా, డైరీ, స్వీట్ మొత్తం కట్. ఆరోగ్యాలు మరీ బాగైపోతాయి బాబో అంటూ ఫినిషింగ్ ఇచ్చింది. సుమ మరి కొన్ని మంత్రిత్వ శాఖలు కూడా ఎవరికి కేటాయిస్తారని మహేశ్‌, పరుశురామ్‌లను అడిగితే... గాసిప్ మినిస్టర్ గా- నిర్మాత రవి, సోషల్ మీడియా మంత్రిగా- థమన్, ఈవెనింగ్ పార్టీల మినిస్టర్‌గా - నిర్మాత నవీన్ యెర్నేని, క్రమశిక్షణ శాఖకు -  ఎగ్డికూటివ్ ప్రొ. ఈపీ రాజు, ఫ్యాషన్ మినిస్ట్రీకి హిరోయిన్ కీర్తి సురేష్‌ అండ్ టీమ్ పర్‌ఫెక్ట్‌గా సరిపోతారంటూ హీరో, దర్శకుడు సరదాగా సమాధానమిచ్చారు.

Also Read - Major Trailer: నువ్వు నా జీవితాన్ని తీసుకోవచ్చు గానీ.. నా దేశాన్ని కాదు! కంటతడి పెట్టిస్తున్న మేజర్‌ ట్రైలర్

Also Read - SVP Trailer Record: రికార్డులు బద్దలు కొట్టిన 'సర్కారు వారి పాట' ట్రైలర్‌.. అర్ధ గంటలోనే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News