National Youth Day 2022: నేడు స్వామీ వివేకానంద జయంతి- ఉపరాష్ట్రపతి, ప్రధాని నివాళులు

National Youth Day 2022: నేడు స్వామీ వివేకానంద జయంతి. ఈ రోజును దేశవ్యాప్తంగా జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవడం తెలిసిందే. ఈ సందర్భంగా వివేకానందుడికి ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2022, 11:51 AM IST
  • నేడు జాతీయ యువజన దినోత్సవం
  • స్వామీ వివేకానందుడికి నివాళులర్పించిన ప్రముఖులు
  • నవ భారత నిర్మాణంలో భాగస్వాములవ్వాలని ఉపరాష్ట్రపతి పిలుపు
  • వివేకానంద కలలను నిజయం చేయాలని యువతకు సూచించిన ప్రధాని
National Youth Day 2022: నేడు స్వామీ వివేకానంద జయంతి- ఉపరాష్ట్రపతి, ప్రధాని నివాళులు

National Youth Day 2022: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్వామీ వివేకానంద జయంతి సందర్భంగా (Swami Vivekananda birth anniversary ) ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు.

జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా, నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించే దిశగా కంకణబద్ధులు కావాలని ఉపత రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు దేశ యువతకు (Vice President Tributes to Swami Vivekananda) పిలుపునిచ్చారు. ఉన్నతమైన కలలు కని వాటిని నెరవేర్చుకునేందుకు శ్రమించాలన్నారు. ప్రపంచానికి యువత ఆదర్శంగా నిలవాలని ట్విట్టర్​ ద్వారా ఆయన ఆకాంక్షించారు.

'స్వామి వివేకానందుల వారు భారతీయ యువత సామర్థ్యానికి ప్రతిరూపం. వారి స్ఫూర్తితో జాతీయ భావనతో పాటు సేవామార్గంతో కూడిన ఆధ్యాత్మిక భావనను, మనందరికీ గర్వకారణమైన మహోన్నత సాంస్కృతిక వారసత్వాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.' అని వెంకయ్య నాయుడు (Venkaiah Naidu on Swami Vivekananda) ట్వీట్​ చేశారు.

ట్విట్టర్ ద్వారా నివాళులర్పించిన మోదీ.. స్వామీ వివేకానంద తన జీవితాన్ని జాతికి అంకితమించ్చారి (PM Modi Tributes to Swami Vivekananda) పేర్కొన్నారు. జాతి నిర్మాణంకోసం ఎందరో యువతను ప్రోత్సహిచాలని వెల్లడించారు. మన దేశం కోసం ఆయన కన్న కలలు నిజం చేసేందుకు కృషి చేయాలని (PM Modi  Call for Youth) పిలుపునిచ్చారు.

వివేకానంద జయంతినే మన దేశంలో జాతీయ యువజన దినోత్సవంగా (National Youth Day ) జురుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పుదుచ్చేరిలో 25వ నేషనల్​ యూత్ ఫెస్టివల్​ను ప్రారభించనున్నారు.

స్వామీ వివేకానంద గురించి..

స్వామీ వివేకానంద 1863ల జనవరి 12న పశ్చిమ్​ బెంగాల్​లో (Swami Vivekananda birth date) జన్మించారు. ఆయన అసలు పేరు నరేంద్రనాథ్​ దత్​. చిన్నప్పటి నుంచే ఆయన ఆధ్యాత్మికంపై మొగ్గు చూపే వారు. ఆ ఆసక్తితోనే యోగి రామకృష్ణ పరమహంస శిష్యుడిగా చేరారు. ఆయనకు అత్యంత ప్రీతి పాత్రుడైన శిష్యుడిగా పేరు సంపాదించారు. 19వ శతాబ్దంలో అత్యంత ఆదరణ పొందిన ఆధ్యాత్మికవేత్తగా గుర్తింపు సంపాదించారు.

తన గురువు రామకృష్ణ పరమహంస పేరుపై.. రామకృష్ణ మఠాన్ని స్థాపించి సనాతన హిందూ ధర్మాన్ని చాటి చెప్పేందదుకు కృషి చేశారు. అనేక సేవా కార్యక్రమాలు ఈ మఠం ఆధ్వర్యంలో నడుస్తుండటం గమనార్హం.

1893లో చికాగోలో ఆయన చేసిన ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా (Swami vivekananda chicago speech) మార్మోగింది. భగవద్గిత విలువ, పవిత్రతను పాశ్యాత్య దేశాలకు పరిచయం చేసిన ఘనత ఆయనదే అనడంలో అతిశయోక్తి లేదు. ఆయన యువకుడిగా ఉన్నప్పుడే ఎన్నో విజయాలు సాధించారు. అందుకే యువతకు స్పూర్తిగా ఆయననే చూపిస్తుంటారు. 1902 జులై 4న 39 ఏళ్ల వయసులోనే ఆయన తుది శ్వాస (Swami vivekananda death age) విడిచారు.

Also read: Nitin Gadkari: వీఐపీలను వెంటాడుతున్న కరోనా వైరస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకు కరోనా పాజిటివ్

Also read: Supreme Court: ఇంటి కోసం డబ్బులు డిమాండ్ చేసినా..వరకట్న వేధింపే, సుప్రీంకోర్టు సంచలన తీర్పు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News