Supreme Court: వరకట్నం, వేధింపులకు సంబంధించి దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఇంటి నిర్మాణ నిమిత్రం డబ్బులు డిమాండ్ చేసినా..వరకట్నం వేధింపుల పరిధికే వస్తాయని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
దేశంలోని అత్యున్నత న్యాయస్థానం నుంచి ఆసక్తికరమైన, కీలకమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. వరకట్నం కేసులకు సంబంధించి ఈ వ్యాఖ్యలు చాలా ప్రాధాన్యత కలిగినవిగా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హిమకోహ్లిలతో కూడిన ధర్మాసనం ఇచ్చిన సంచలన తీర్పు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కట్నం వేధింపుల కారణంగా ఐదేళ్ల గర్భిణి మరణానికి కారణమైన భర్త, మామలకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష ఖరారు చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం.
ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. మధ్యప్రదేశ్(Madhya pradesh)రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. ఇంటి నిర్మాణం కోసం డబ్బులు డిమాండ్ చేసిన కేసు ఇది. బాధితురాలు కుటుంబసభ్యుల్ని ఇంటి నిర్మాణానికి డబ్బు అడగడం కట్నం పరిధిలో రాదని మధ్యప్రదేశ్ హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన ప్రత్యేక అప్పీల్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. కుటుంబం నుంచి డబ్బులు తీసుకురావాలంటూ పదే పదే ఆ బాధితురాలిని చిత్రహింసకు గురి చేయడంతో ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఆ సమయంలో ఆమె ఐదు నెలల గర్భిణీ. ఈ కేసుపై మద్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు..మృతురాలి డిమాండ్ వెనుక ఉన్న కోణాన్ని అర్ధం చేసుకోవాలని తెలిపింది. ఇది కచ్చితంగా వరకట్న వేధింపుల కిందకే వస్తుందని చెబుతూ...దోషులిద్దరికీ ఏడేళ్ల కఠిన కారాగార శిక్షను ఖరారు చేసింది.
ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 304 బి ప్రకారం ఇంటి నిర్మాణానికి డబ్బు చేయడం కూడా కట్నం వేధింపులేనని కోర్టు పేర్కొంది. వరకట్న డిమాండ్ అనే సామాజిక దురాచారాన్ని ఎదుర్కొనేందుకు ఐపీసీ సెక్షన్ 304 బి నిబంధన ఆందోళనకరంగా మారిందన్నారు సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ.(Justice NV Ramana) కట్నం అనే పదానికి నిర్వచనం పరిధిలో ఏ రకమైన ఆస్థి లేదా విలువైన వస్తువులు కూడా వస్తాయని సుప్రీంకోర్టు తెలిపింది. ఇంటి నిర్మాణం నిమిత్తం చేసిన డిమాండ్ ను కట్నంగా పరిగణించలేమన్న హైకోర్టు తీర్పును ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తప్పుబట్టింది. వాస్తవానికి ఈ కేసులో ట్రయల్ కోర్టు కూడా ఇదే రకంగా అభిప్రాయపడింది. అయితే హైకోర్టు ట్రయల్ కోర్టు తీర్పును కొట్టివేసింది. ఇప్పుడు తిరిగి సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును తప్పుబడుతూ..ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఖరారు చేసింది. ఇదేమీ సంక్లిష్టమైన కేసు కాదని..ప్రతికూల పరిస్థితుల్లో మరణించిన వ్యక్తి ఎదుర్కొన్న నిస్సహాయ కేసు అని సుప్రీంకోర్టు (Supreme Court) వ్యాఖ్యానించింది.
Also read: Omicron Variant: ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతిని ఆపలేమంటున్న వైద్య నిపుణులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి