Agriculture Bills: వ్యవసాయ బిల్లులకు వైఎస్సార్‌సీపీ మద్దతు

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొస్తున్న వ్యవసాయ బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. వైఎస్సార్‌సీపీ ఆ బిల్లులకు మద్దతు (YSRCP Supports for Agriculture Bills) తెలిపింది. ఎంపీ విజయసాయిరెడ్డి వైఎస్సార్‌సీపీ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు.

Last Updated : Sep 20, 2020, 01:41 PM IST
  • వ్యవసాయ బిల్లులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు
  • వ్యవసాయ బిల్లుల ద్వారా రైతులకు స్వేచ్ఛ లభిస్తుందన్నారు
  • ఆ పార్టీ రాజ్యసభ్య సభ్యుడు వి.విజయసాయిరెడ్డి
Agriculture Bills: వ్యవసాయ బిల్లులకు వైఎస్సార్‌సీపీ మద్దతు

న్యూఢిల్లీ: వ్యవసాయ బిల్లులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లులకు వైఎస్సార్‌సీపీ మద్దతిచ్చింది. తాజా వ్యవసాయ బిల్లుల ద్వారా రైతులకు స్వేచ్ఛ లభిస్తుందన్నారు ఆ పార్టీ రాజ్యసభ్య సభ్యుడు వి.విజయసాయిరెడ్డి. బిల్లులు చట్టాలుగా మారి అమలులోకి వస్తే దళారీ వ్యవస్థకు ముగింపు పలకవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. TikTok Ban: టిక్‌టాక్ నిషేధంపై గడువు పెంచిన అమెరికా

ప్రభుత్వాలు రైతులకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు పండించే పంటలకు ముందుగానే ధర నిర్ణయించడంతో రైతన్నలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. మార్కెట్ కమిటీల నియంతృత్వానికి, దళారీ వ్యవస్థకు స్వస్తి పలకవచ్చునని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఏపీలో రైతు భరోసా పేరుతో 49 లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.13,500 మేర అందిస్తుందని తెలిపారు. దీంతో పాటు రైతు భరోసా కేంద్రాలతో విత్తనాలు, ఎరువులు.. తదితరాలు రైతన్నలకు ఉపశమనం కల్పిస్తున్నాయని చెప్పారు. రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధిని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా రాజ్యసభలో వెల్లడించారు. MSK Prasad Trolls: అంబటి రాయుడు అదరహో.. ఎమ్మెస్కే ప్రసాద్‌పై 3D రేంజ్‌లో ట్రోలింగ్  

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News