Sparsha Darshanam: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్తున్న భక్తులకు కీలకమైన సూచన. శ్రీశైలం ఆలయంలో భారీ మార్పు జరిగింది. తప్పక ఈ విషయం తెలుసుకుని శ్రీశైలం వెళ్తే ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉంటారు. శ్రీశైలంలో పరమశివుడిని స్పర్శిస్తూ దర్శించుకోవడం అంటే చాలా అదృష్టం చేసుకుని ఉండాలి. అలాంటి స్పర్శ దర్శనంలో ఆలయ కమిటీ కీలక మార్పు చేసింది. శ్రీశైల మహా క్షేత్రాన్ని దర్శించుకునే భక్తులకు దేవస్థానం కీలక నిర్ణయం తీసుకున్నది. రద్దీ రోజుల్లో స్పర్శ దర్శనంలో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది.
Also Read: Modi AP Tour: ప్రధాని మోదీ పర్యటనకు భారీ ఏర్పాట్లు.. తొలిసారి పర్యటనతో ఏపీకి ఏమీ వరాలు దక్కెను?
శ్రీశైల మహా క్షేత్రాన్ని దర్శించే భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. సర్వ దర్శనం క్యూ లైన్‌లోని సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో రద్దీ రోజుల్లో స్వామి వారి స్పర్శ దర్శన ఏర్పాటు విషయంలో మార్పులు చేసినట్లు తెలిపింది. ఇక మీదట రద్దీ ఎక్కువగా ఉండే ప్రతి శని, ఆది, సోమవారాలు, ప్రభుత్వ సెలవు రోజులలో కేవలం రెండుసార్లు మాత్రమే స్పర్శ దర్శనం చేయాలని నిర్ణయించింది.
Also Read: Dokka Seethamma Mid Day Meal: ఏపీ విద్యార్థులకు జాక్ పాట్.. రేపటి నుంచి మధ్యాహ్న భోజనం
సెలవు రోజులు.. ప్రత్యేక దినోత్సవాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుండడంతో ఆ రోజుల్లో ఉదయం 7.30 గంటలకు.. రాత్రి తొమ్మిది గంటలకు మాత్రమే స్పర్శ దర్శనం కల్పిస్తున్నట్లు దేవస్థానం ఈఓ ఎం శ్రీనివాస రావు వెల్లడించారు. ఆ రోజుల్లో మిగతా వేళల్లో స్వామి వారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తామని చెప్పారు. గతంలో అమలులో ఉన్న మధ్యాహ్న కాలపు స్పర్శ దర్శనం రద్దీ రోజుల్లో పూర్తిగా నిలిపేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే ఈ స్పర్శ దర్శనం టికెట్లను భక్తులు కేవలం ఆన్‌లైన్ ద్వారా పొందాల్సి ఉంటుందని ఈఓ శ్రీనివాస రావు స్పష్టం చేశారు. ఒక్కో విడతలో కేవలం 500 టికెట్లు మాత్రమే జారీ చేస్తామని వెల్లడించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రతి శని, ఆది, సోమవారాలు, ప్రభుత్వ సెలవు రోజులలో ఆర్జిత కుంకుమార్చనలు నిర్వహిస్తామని వివరించారు. అమ్మవారి ఆలయంలోని ఆశీర్వచన మండపంలో రూ.1,000 సేవా రుసుముతో ఆర్జిత కుంకుమార్చనలు నిర్వహిస్తామని చెప్పారు. శ్రీశైలం వచ్చే భక్తులు ఈ మార్పులు గమనించాలని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook