Dokka Seethamma Mid Day Meal: ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా మధ్యాహ్న భోజనం ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల హాజరుశాతం.. ఫలితాల మెరుగుదలలో భాగంగా మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ కార్యక్రమానికి శనివారం శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న 1,48,419 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనుంది.
Also Read: Metro Rail: విశాఖపట్టణం, విజయవాడకు డబుల్ డెక్కర్ మెట్రో రైలు.. 2029లో పట్టాలపై పరుగులు
విజయవాడ పాయకాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి నారా లోకేశ్ ప్రారంభించనున్నారు. 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 398 సమీపంలోని పాఠశాలలకు అనుసంధానమై ఉండడంతో అక్కడ భోజనాలను తయారు చేస్తారు. మిగిలిన 77 కళాశాలలకు కేంద్రీకృత వంటశాలలకు అనుసంధానించారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల మధ్యాహ్న భోజనం అమలుకు ఈ ఏడాది రూ.27.39 కోట్లు విడుదల చేశారు. వచ్చే విద్యాసంవత్సరంలో రూ.85.84 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read: Sankranti: సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ పోలీసుల భారీ షాక్.. కోడి పందాలకు బ్రేక్
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం ప్రారంభిస్తుండడంతో విద్యార్థుల హాజరు సంఖ్య మెరుగవుతుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. నాణ్యమైన భోజనం అందిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య కూడా అందించి విద్యార్థుల భవిష్యత్‌కు బలమైన పునాది వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మధ్యాహ్న భోజనం అమలు చేసేందుకు సిద్ధమైంది. అయితే మధ్యాహ్న భోజనంలో వారంలో ఆరు రోజులు రకరకాల ఆహార పదార్థాలు అందించనున్నారు. మెనూ ప్రకారం భోజనం అందించేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంది. మధ్యాహ్న భోజనం పథకాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు చదువులో రాణించాలని ప్రభుత్వం సూచిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook