Modi AP Tour: ప్రధాని మోదీ పర్యటనకు భారీ ఏర్పాట్లు.. తొలిసారి పర్యటనతో ఏపీకి ఏమీ వరాలు దక్కెను?

PM Narendra Modi AP Visit Arrangements: మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ రెండోసారి ఏపీకి రానుండగా భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. నారా లోకేశ్‌ పర్యవేక్షణలో ప్రధాని పర్యటన జరగనుంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 5, 2025, 09:57 PM IST
Modi AP Tour: ప్రధాని మోదీ పర్యటనకు భారీ ఏర్పాట్లు.. తొలిసారి పర్యటనతో ఏపీకి ఏమీ వరాలు దక్కెను?

Narendra Modi AP Visit: ఎన్డీయే కూటమిలో కీలక భూమిక పోషిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండోసారి పర్యటిస్తుండడంతో అందరి దృష్టి ఏపీపై పడింది. ఈనెల 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనకాపల్లి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన పర్యవేక్షణ బాధ్యతలను నారా లోకేశ్‌కు ప్రభుత్వం అప్పగించింది. ప్రధాని మోదీ పర్యటన ఇన్‌చార్జ్‌గా లోకేశ్‌ను ప్రభుత్వం నియమించింది.

Also Read: Modi AP Tour: 8వ తేదీన ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ రాక.. వరాల వర్షం కురిపించేనా..?

ప్రధాని పర్యటన సందర్భంగా ఏర్పాట్లపై విశాఖ సర్క్యూట్ హౌస్‌లో  ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఓపెన్ టాప్‌లో రోడ్ షో చేయనున్నారు. రోడ్ షో నిర్వహణ ఏర్పాట్లు, సభకు తరలివచ్చే ప్రజానీకం కోసం ఏర్పాట్లపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు డీబీవీ స్వామి, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, అచ్చెంనాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విప్‌లు గణబాబు, వేపాడ చిరంజీవి రావు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బాబు, పంచకర్ల రమేశ్‌ బాబు, బండారు సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. సభకి తరలివచ్చే అతిథులకు, యావత్ ప్రజానీకానికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు కేంద్ర మంత్రి రామ్మోహన్‌కు వివరించారు.

Also Read: Dokka Seethamma Mid Day Meal: ఏపీ విద్యార్థులకు జాక్‌ పాట్‌.. రేపటి నుంచి మధ్యాహ్న భోజనం

'ప్రధాని పర్యటన ఉత్తరాంధ్రకు కొత్త ఉత్తేజమిస్తుంది. ఉత్తరాంధ్ర ప్రగతి పథంలో ఒక కీలక మైలురాయిగా ప్రధాని పర్యటన నిలుస్తుంది' అని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. 'రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోది శ్రీకారం చుడుతున్నారు' అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు.

ఇన్‌చార్జిగా లోకేశ్
ఈ నెల 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటనకు విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మోదీ పర్యటనకు ఇన్‌చార్జిగా మంత్రి నారా లోకేశ్ వ్యవహరించనున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు, అధికారులతో లోకేశ్ సమన్వయం చేసుకుని పర్యటనను విజయవంతం చేసేందుకు సిద్ధమయ్యారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Trending News