Asia Cup 2022: ఆసియా కప్‌లో రేపే భారత్, పాకిస్థాన్ మ్యాచ్..ఇరు జట్లు ఎన్ని సార్లు గెలిచాయో తెలుసా..?

Asia Cup 2022: ఆసియా కప్ ఫీవర్ మొదలైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్, పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ రేపు జరగనుంది.

Written by - Alla Swamy | Last Updated : Aug 27, 2022, 05:57 PM IST
  • ఆసియా కప్ ఫీవర్
  • రేపే బిగ్ ఫైట్
  • దుబాయ్ వేదికగా మ్యాచ్
Asia Cup 2022: ఆసియా కప్‌లో రేపే భారత్, పాకిస్థాన్ మ్యాచ్..ఇరు జట్లు ఎన్ని సార్లు గెలిచాయో తెలుసా..?

Asia Cup 2022: ఆసియా కప్ 2022లో రేపు(ఆదివారం) భారత్, పాకిస్థాన్‌ మధ్య బిగ్ ఫైట్ జరగబోతోంది. దుబాయ్ వేదికగా రేపు రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం అవుతుంది. ఇప్పటివరకు జరిగిన ఆసియా కప్‌ల్లో దాయాది దేశం పాకిస్థాన్‌పై భారత్‌దే ఆధిపత్యం చెల్లాయిస్తోంది. ఆసియా కప్‌లో టీమిండియా, పాక్ జట్లు 14 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ జట్టు 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. పాకిస్థాన్‌ 5 సార్లు విజయ ఢంకా మోగించింది. 

ఓ మ్యాచ్‌ రద్దైంది. 1984లో జరిగిన ఆసియా కప్‌ పోటీల్లో పాక్‌పై భారత్ 54 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. 1988లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 1995 ఆసియా కప్‌లో భారత్‌పై పాకిస్థాన్‌ 97 పరుగుల తేడాతో గెలిచింది. 1997 ఆసియా కప్‌లో భారత్, పాక్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. 2000 ఆసియా కప్‌లో భారత్‌ను పాక్‌ 44 పరుగుల తేడాతో ఓడించింది. 2004లో శ్రీలంక వేదికగా ఆసియా కప్ జరిగింది. 

ఈటోర్నీలో భారత్‌పై పాక్‌ గెలుపొందింది. 2008లో జరిగిన ఆసియా కప్‌లో టీమిండియా, పాక్‌ రెండు సార్లు తలపడ్డాయి. ఇందులో చెరో విజయం సాధించాయి. 2010లో పాక్‌పై భారత్ మూడు వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. 2012లో పాక్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.2014లో మాత్రం టీమిండియాపై పాక్‌ ఒక వికెట్‌ తేడాతో గెలిచింది. 2016 ఆసియా కప్‌ పోటీల్లో పాక్‌పై జయకేతనం ఎగురవేసింది భారత్. 

2018లో జరిగిన ఆసియా కప్‌లో భారత్, పాక్‌ రెండుసార్లు ఢీకొన్నాయి. రెండు మ్యాచ్‌ల్లోనూ పాక్‌కు పరాజయం తప్పలేదు. మరోమారు రేపు భారత్, పాక్‌ తలపడనున్నాయి. బలాబలాల పరంగా ఇరుజట్లు బలంగా ఉన్నాయి. ఈసారి టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్‌ జరుగుతోంది. రేపటి మ్యాచ్‌ ఉత్కంఠగా సాగనుంది. 

భారత జట్టు(అంచనా)..

రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దినేష్‌ కార్తీక్, హర్దిక్ పాండ్యా, జడేజా, భువనేశ్వర్, అవేష్ ఖాన్, చాహల్

Also read:KTR COMMENTS ON MUNAWAR: సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది! మునావర్ షో వివాదంపై కేటీఆర్ షాకింగ్..

Also read:Jharkhand Crisis: జార్ఖండ్‌లో 'మహా' డ్రామా రిపీట్ అవుతుందా..? ఎమ్మెల్యేల తరలింపు ముమ్మరం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News