ENG vs PAK: ఈసారైనా పాకిస్తాన్‌పై ఇంగ్లాండ్ కల నెరవేరేనా ?

ఇంగ్లాండ్ vs పాకిస్తాన్ (ENG vs PAK) 1 వ టెస్ట్, డే 1 లైవ్ క్రికెట్ స్కోర్ అప్‌డేట్స్ విషయానికొస్తే.. ఇంగ్లాండ్‌పై టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టేన్ అజార్ అలీ ( Azhar Ali ) తొలుత బ్యాటింగ్ చేయడానికే ఎంచుకున్నాడు.

Last Updated : Aug 5, 2020, 04:20 PM IST
ENG vs PAK: ఈసారైనా పాకిస్తాన్‌పై ఇంగ్లాండ్ కల నెరవేరేనా ?

మాంచెస్టర్: ఇంగ్లాండ్ vs పాకిస్తాన్ (ENG vs PAK) 1 వ టెస్ట్, డే 1 లైవ్ క్రికెట్ స్కోర్ అప్‌డేట్స్ విషయానికొస్తే.. ఇంగ్లాండ్‌పై టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టేన్ అజార్ అలీ ( Azhar Ali ) తొలుత బ్యాటింగ్ చేయడానికే ఎంచుకున్నాడు. మరోవైపు గత నెలలో వెస్టిండీస్‌పై 2-1 తేడాతో విజయం సాధించిన జోష్‌లో ఉన్న ఇంగ్లాండ్ జట్టు కెప్టేన్ జో రూట్ ( Joe Root ) తాజాగా పాకిస్తాన్‌పైనా అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్‌, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న తొలి టెస్ట్ మ్యాచ్‌కి మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం వేదికైంది. Also read: నిజం చెప్పండి.. : ఆటగాళ్లకు BCCI warning

పాకిస్థాన్‌పై స్వదేశంలో 2010లో ఇంగ్లాండ్ చివరిసారిగా ఒక టెస్ట్ సిరీస్ గెలిచింది. గత పదేళ్ల కాలంలో ఇంగ్లాండ్‌కి మళ్లీ అటువంటి విజయం దక్కలేదు. ఈ రెండు జట్ల మధ్య జరిగిన చివరి రెండు సిరీస్‌లు 2016 లో 2-2, 2018 లో 1-1తో డ్రాగానే ముగిశాయి. దీంతో ఈ సిరీస్‌లో గెలవడం ద్వారా మరోసారి అటువంటి విజయాన్ని సొంతం చేసుకోవాలని ఇంగ్లాండ్ జట్టు ఉవ్విళ్లూరుతోంది. Also read: Rohit Sharma: ముంబై జట్టులో రోహిత్‌కు అతి తక్కువ ప్రాధాన్యం

Trending News