Shikhar Dhawan: వెండి తెరపైకి మరో స్టార్ క్రికెటర్‌ రాబోతున్నాడా..? నిజమెంత..?

Shikhar Dhawan: మరో స్టార్‌ క్రికెటర్ వెండితెరపై మెరవపోతున్నాడా..? ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయా..? ఇప్పటికే సినిమా షూటింగ్ మొదలైందా..? ఆ మూవీ ఏంటి..? సినీ వర్గాలు ఏం చెబుతున్నాయి..?  ఆ క్రికెటర్ ఏమంటున్నారు..?

Written by - ZH Telugu Desk | Last Updated : May 17, 2022, 09:08 PM IST
  • వెండితెరపైకి మరో స్టార్ ప్లేయర్
  • త్వరలో మూవీ రానున్నట్లు ప్రచారం
  • ఇప్పటికే ఎంట్రీ ఇచ్చిన హర్భన్‌ సింగ్,శ్రీశాంత్
Shikhar Dhawan: వెండి తెరపైకి మరో స్టార్ క్రికెటర్‌ రాబోతున్నాడా..? నిజమెంత..?

Shikhar Dhawan: మరో స్టార్‌ క్రికెటర్ వెండితెరపై మెరవపోతున్నాడా..? ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయా..? ఇప్పటికే సినిమా షూటింగ్ మొదలైందా..? ఆ మూవీ ఏంటి..? సినీ వర్గాలు ఏం చెబుతున్నాయి..?  ఆ క్రికెటర్ ఏమంటున్నారు..?
 
భారత్‌ క్రికెట్‌లో శిఖర్ ధావన్ పేరు తెలియని వారు ఉండరు. తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ అందర్నీ అలరిస్తున్నాడు. జాతీయ జట్టుతోపాటు ఐపీఎల్‌లోనూ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఐతే ఇప్పుడు అతడు సినిమాల్లోకి వస్తారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల దేశంలో క్రికెటర్లు ..సినిమాల్లోకి..రాజకీయాల్లోకి వెళ్లడం చూస్తునే ఉన్నాం. తాజాగా ఆ జాబితాలో శిఖర్ ధావన్‌ చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఇదివరకే  క్రికెటర్లు హర్భజన్ సింగ్, శ్రీశాంత్‌ సినిమాల్లో వెళ్లారు. వెండితెరపై తమ విశ్వరూపాన్ని చూపించారు. భారత మాజీ కెప్టెన్ ధోనీ సైతం సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు శిఖర్‌ ధావన్ యాక్టింగ్‌లో అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఓ భారీ చిత్రంలో నటించబోతున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ కూడా అయిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో సినిమా టైటిల్ రాబోతున్నట్లు సినీ వర్గాలే విశ్లేషిస్తున్నాయి. 

గతంలో అక్షయ్ కుమార్ మూవీ రామ సేతులో నటిస్తారని వార్తలు వచ్చాయి. ఐతే అది తప్పుడు ప్రచారమని క్లారిటీ వచ్చింది. శిఖర్‌ ధావన్‌ సైతం సోలో హీరోగా రావాలని ఆలోచిస్తున్నట్లు ఆయన అనుచరులే చెబుతున్నారు. ఈఏడాదిలోనే మూవీ విడుదల కానున్నట్లు గుసగుసలాడుతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో త్వరలో తేలనుంది. 
 

Also read:North Korea Corona: ఉత్తర కొరియాలో మాయదారి వైరస్ విజృంభణ..వణికిపోతున్న ప్రజలు..!

Also read:YSRCP Candidates: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News