YSRCP Candidates: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే..!

YSRCP Candidates: ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు అయ్యాయి. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన సీఎం జగన్ ..పేర్లను ఫైనల్ చేశారు. విజయసాయిరెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు పేర్లను వైసీపీ తరపున ఖరారు అయ్యారు. రాజ్యసభ అభ్యర్థుల జాబితాను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 17, 2022, 05:59 PM IST
  • వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు
  • పేర్లు ప్రకటించిన సజ్జల, బొత్స
  • అన్నివర్గాలకు సముచిత స్థానం కల్పించామని ప్రకటన
YSRCP Candidates: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే..!

YSRCP Candidates: ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు అయ్యాయి. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన సీఎం జగన్ ..పేర్లను ఫైనల్ చేశారు. విజయసాయిరెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు పేర్లను వైసీపీ తరపున ఖరారు అయ్యారు. రాజ్యసభ అభ్యర్థుల జాబితాను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అన్ని వర్గాలకు సీఎం జగన్‌ సముచిత స్థానం కల్పించారని స్పష్టం చేశారు.

నాలుగులో సగం స్థానాలను బలహీన వర్గాలకు ఇచ్చారని చెప్పారు. ఈ స్థాయిలో బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఎప్పుడు ఇవ్వలేదన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి నిర్ణయం ఏ సీఎం తీసుకోలేదని తెలిపారు. ఆర్.కృష్ణయ్య బీసీలకు సింబల్‌గా ఉన్నారని..అందుకే ఆయనను రాజ్యసభకు పంపుతున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్ససత్యనారాయణ అన్నారు.

బీసీలపై తనకు నిబద్ధతను సీఎం జగన్ చాటారని చెప్పారు బీసీ నేత ఆర్.కృష్ణయ్య.  తనకు రాజ్యసభ ఇవ్వడం ద్వారా బీసీలపై ఉన్న చిత్తశుద్ది ఏంటో అర్థమవుతుందన్నారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లోనూ బీసీలకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. తాను రాజ్యసభకు పోవడం ద్వారా బీసీల కోసం పోరాడే అవకాశం దొరికిందని తెలిపారు. వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నిక కావడం అంటే ఆ పార్టీలో చేరినట్లేనని స్పష్టం చేశారు ఆర్.కృష్ణయ్య. 

Also read:Green Card: గ్రీన్‌కార్డుదారులకు గుడ్‌న్యూస్..కీలక ప్రతిపాదనలకు పచ్చజెండా..!

Also read:Minister KTR Twit: అచ్ఛే దిన్ అంటే ఇదేనా..మంత్రి కేటీఆర్ ట్వీట్..ప్రధాని కౌంటర్.!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News