మందుబాబులకు సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

కరోనా వైరస్‌ను అరికట్టేందుకు తపస్సు చేశామని, దాని ఫలితాన్ని పొందాలంటే మరికొన్ని రోజులు కాస్త కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు CM KCR. 

Last Updated : May 6, 2020, 09:48 AM IST
మందుబాబులకు సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

తెలంగాణలో లాక్‌డౌన్‌ను మే 29 వరకు పెంచుతూ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం రాత్రి మీడియా సమావేశం నిర్వహించిన కేసీఆర్ పలు విషయాలు ప్రస్తావించారు. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు తపస్సు చేశామని, దాని ఫలితాన్ని పొందాలంటే మరికొన్ని రోజులు కాస్త కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు.  నటుడు శివాజీ రాజాకు గుండెపోటు

ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు తెరవనున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో మందు బాబులకు స్ట్రాంగ్ వార్నింగ్ సైతం ఇచ్చారు. గ్రామాలు, మండల కేంద్రాల వరకు అన్ని మద్యం దుకాణాలు తెరుచుకుంటాయని, అదే మున్సిపాలిటీ, నగర పంచాయితీలు ఆపై నగరాలలో ప్రతి రెండు షాపుల్లో ఒకటి తెరిచేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందున్నారు. లాటరీ విధానంలో షాపులను ఎంపిక చేసి 50శాతం దుకాణాలు ఓరోజు, మరుసటి రోజు మిగతా మద్యం దుకాణాలు తెరుచుకుంటాయన్నారు. ‘శ్రద్ధ’ చూపుతోన్న చీర అందాలు

కరోనా వైరస్‌ను తరిమికొట్టాలంటే భౌతిక దూరం (సోషల్ డిస్టాన్సింగ్) తప్పనిసరి అని పేర్కొన్నారు. వైన్స్ షాపులు, మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని మందుబాబులకు సూచించారు. భౌతిక దూరం పాటించడం లేదని ఎలక్ట్రానిక్ మీడియాలో తాను గమనిస్తే మాత్రం మద్యం షాపులను పూర్తి స్థాయిలో మూసివేస్తామని హెచ్చరించారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా! 

Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

Trending News