హైదరాబాద్‌లో దారుణం.. బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం

భోజనం ఇచ్చిరమ్మని తన సోదరుడి ఇంటికి 12 ఏళ్ల కూతుర్ని తల్లి పంపించింది. ఇదే అవకాశంగా భావించిన క్రైమ్ కానిస్టేబుల్ పశువులా ప్రవర్తించి మైనర్ బాలికపై అత్యాచారం(Minor Girl Raped in Hyderabad) చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.

Last Updated : Jun 26, 2020, 08:42 AM IST
హైదరాబాద్‌లో దారుణం.. బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం

హైదరాబాద్(Hyderabad) నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలికపై క్రైమ్ కానిస్టేబుల్ అత్యాచారానికి(Constable Rapes a girl) పాల్పడటమే కాకుండా ఎవరికైనా విషయాన్ని చెబితే చంపేస్తానని బెదిరించాడు. జరిగిన దారుణాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్న బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బోయిన్‌పల్లి పోలీసుల కథనం ప్రకారం.. వరదరాజ్ ఉమేశ్(33)కు వివాహమై కూతురు కూడా ఉంది. ఉమేశ్ నగరంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్ సమయంలో దాదాపు రెండు నెలల కింట ఉమేశ్ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. షాకిచ్చిన వెండి

ఉమేశ్‌కు భోజనం ఇచ్చిరమ్మని తన సోదరుడి ఇంటికి 12 ఏళ్ల కూతుర్ని తల్లి పంపించింది. ఇదే అవకాశంగా భావించిన ఉమేశ్ తన మేనకోడలిపై పశువులా ప్రవర్తించి అత్యాచారం(Minor Girl Raped) చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికను బెదిరించాడు. ఆ తర్వాత ఏదైనా పని మీద తన సోదరుడు ఉమేశ్ ఇంటికి వెళ్లమంటే కూతురు కాస్త భయపడేది. విషయం ఏంటని కూతుర్ని ఆరాతీయగా జరిగిన దారుణాన్ని తల్లికి వివరించింది. Photos: జబర్దస్త్ యాంకర్ అనసూయ హొయలు

బాలిక తల్లిదండ్రులు గురువారం బోయిన్‌పల్లి పోలీసులతో పాటు బాలల హక్కుల సంఘాన్ని సైతం ఆశ్రయించారు. అదనపు పోలీస్ కమిషనర్ షికాగోయల్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించామని నార్త్ జోన్ డీసీపీ తెలిపారు. అతడ్ని జాబ్ నుంచి తొలగించాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది. అతి వేగంగా తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు

బాలికపై జరిగిన దారుణంపై నగర కమిషనర్ అంజనీ కుమార్ స్పందించారు. ‘చట్టానికి ఎవరూ అతీతులు కాదు. అఘాయిత్యానికి పాల్పడ్డ రామ్‌గోపాల్ పేటకు చెందిన కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తాం. పోలీస్ శాఖలో ఇలాంటి వారు ఉన్నందుకు సిగ్గుపడుతున్నా. ఇలాంటివి జరగకుండా మా పనితీరు మెరుగుపరుచుకునేందుకు మీ విలువైన సూచనలు, సలహాల్ని 9490616555 నెంబర్‌కు పంపించాలని’ ట్వీట్ ద్వారా కోరారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ
  

Trending News