అతి వేగంగా తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు

Health Tips | తొందర తొందరగా ఆహారం తినడం మన పాలిట శాపంగా మారుతుంది.  అలా తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు, వ్యాధులు ఉత్పన్నమవుతాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Last Updated : Jun 24, 2020, 02:00 PM IST
అతి వేగంగా తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు

Health Risks of Eating Too Fast | చాలా మంది ఆహారాన్ని నెమ్మదిగా తింటుంటారు. మరి కొందరు తొందర తొందరగా తినడానికి ఇష్టపడతారు. వారికి తినడానికి సరైన సమయం ఉండకనో లేక వేరే ఏదైనా టెన్షన్‌లో ఉండి ఆ జీవనశైలికి అలవాటుపడతారు. అయితే ఆహారం త్వరత్వరగా తినడం ఎంత హానికరకమని(Health Issues of Eating Too Fast) మీకు తెలుసా..? అలా తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయో తెలుసా..? లేకపోతే ఇప్పుడు వాటి గురించి తెలుసుకోండి. ఏడిస్తే ఎన్ని లాభాలో తెలుసా..!

వేగంగా తినడం వల్ల కలిగే నష్టాలు (Eating Fast Causes Health Issues)
- చాలా వేగంగా తినడం వల్ల ఓవర్ ఈటింగ్ (OverEating) సమస్యకు దారితీస్తుంది. త్వరగా తినడం వల్ల మన శరీరానికి పోషకాలు సరిగా లభించవు. అంతేకాక మనం ఎంతమేర తింటున్నామో కూడా అర్థంకాదు. ఇది ఓవర్ ఈటింగ్ గా మారుతుంది. దీనివల్ల బరువు పెరుగుతాం. ఊబకాయం వల్ల మనల్ని రోగాలు చుట్టుముడతాయి.

- మీరు తొందర తొందరగా ఆహారం తినడం(Eating Habbits) వల్ల కడుపు నిండిందా లేక ఇంకా ఏమైనా తినాలా, తినడం ఆపేయాలా అనే సంకేతాలు సరైన సమయంలో మీ మెదడుకు చేరవు. ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నారా.. ఇది తెలుసుకోండి

- వేగంగా తినడం(Eating Too Fast) ద్వారా మీరు మీ డైట్ ను పక్కాగా అనుసరించలేరు. పైగా బరువు కూడా వేగంగా పెరుగుతుంది. మనం ఆహారం తినేటప్పుడు సరిగ్గా నమిలి తింటే శరీరానికి సరైన పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఊబకాయం(Obesity) సమస్య అంత త్వరగా మన దరి చేరదు.

- ఇది జీర్ణవ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. తొందర తొందర్లో చాలామంది ఆహారాన్ని ముద్దలు ముద్దలుగా చేసుకోని ఆరగిస్తారు. కనీసం నమలకుండానే మింగేస్తారు. కొన్నిసార్లు నీళ్లు ఎక్కువ తాగి భోజనం చేస్తారు. అప్పుడు ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీంతో సమస్యలు పెరిగి అదికాస్తా జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. సులువుగా రోగ నిరోధకశక్తిని పెంచే చిట్కాలు

- త్వరత్వరగా తినడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణం కూడా అకస్మాత్తుగా పెరుగుతుంది. ఆపై ఇన్సులిన్‌ను నియంత్రించలేక సమస్య పెరుగుతుంది. ఇదికాస్తా మిమ్మల్ని డయాబెటిస్ (Diabetes) వ్యాధి బారిన పడేలా చేస్తుంది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ
 

Trending News