Gaddar Idol on Tankbund: గద్దర్ ఏడిపించిన కేసీఆర్ ఆయన కుటుంబసభ్యులకు క్షమాపణలు చెప్పాలి

Gaddar Idol on Tankbund: ట్యాంక్ బండ్‌పై గద్దర్ విగ్రహాన్ని స్థాపించాలి అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గద్దర్ జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో ముద్రించాలన్న వైఎస్ షర్మిల.. గద్దర్ సొంత ఊరు తూప్రాన్ లో స్మారక భవనం నిర్మించి ఆయన స్పూర్తిని భవిష్యత్ తరాలకు పంచాలని అన్నారు.

Written by - Pavan | Last Updated : Aug 14, 2023, 10:03 AM IST
Gaddar Idol on Tankbund: గద్దర్ ఏడిపించిన కేసీఆర్ ఆయన కుటుంబసభ్యులకు క్షమాపణలు చెప్పాలి

Gaddar Idol on Tankbund: ట్యాంక్ బండ్‌పై గద్దర్ విగ్రహాన్ని స్థాపించాలి అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గద్దర్ జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో ముద్రించాలన్న వైఎస్ షర్మిల.. గద్దర్ సొంత ఊరు తూప్రాన్ లో స్మారక భవనం నిర్మించి ఆయన స్పూర్తిని భవిష్యత్ తరాలకు పంచాలని అన్నారు. ప్రజల కోసం గద్దర్ తన జీవితాన్ని త్యాగం చేశాడు. అలాంటి గద్దర్ ని కేసీఆర్ ఎంతో నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. 9 ఏళ్లుగా గద్దర్ కి సీఎం కేసీఅర్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. కేసీఆర్ అపాయిట్మెంట్ కసం ప్రగతి భవన్ వద్ద రోజంతా ఎదురు చూసినా లోపలకు పిలవకుండా కేసీఅర్ ఒక నియంత అనిపించుకున్నాడు అని వైఎస్ షర్మిల మండిపడ్డారు. 

అపాయిట్మెంట్ ఇవ్వకుండా అవమానించడమే కాకుండా గద్దర్‌ను జైల్లో సైతం పెట్టించి కంటతడి పెట్టించాడు. ఇందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది అని గద్దర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. గద్దర్ బతికి ఉన్నప్పుడు 9 ఏళ్లలో ఒక్కసారి కూడా అపాయిట్మెంట్ ఇవ్వకుండా అవమానించిన కేసీఆర్.. ఇప్పుడు కపట ప్రేమను వ్యక్తపరుస్తూ లేని పోని సానుభూతి వ్యక్తం చేస్తున్నాడు అని మండిపడ్డారు. గద్దర్ ని అవమానించిన కేసీఆర్.. గద్దర్ కుటుంబసభ్యులకు కేసీఅర్ క్షమాపణ చెప్పాలి అని షర్మిల డిమాండ్ చేశారు. 

ఇది కూడా చదవండి : YSRTP, Congress Merger News: విలీనం ఉన్నట్టా లేనట్టా ? షర్మిలను ప్రశ్నించిన మీడియా

 

గద్దర్ ఒక లెజెండ్ కోట్ల మంది ప్రజల గుండెల్లో ఇంకా బతికే ఉన్నాడు. గద్దర్‌కి మరణం లేదు. వైఎస్సార్ అంటే గద్దర్ కి చాలా ప్రేమ. నాతో చాలాసార్లు వైఎస్సార్ తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. గద్దర్‌కి గన్ మెన్ లను వైఎస్సార్ కల్పించారు. గద్దర్ గుండెల్లో వైఎస్సార్ ఉన్నాడు. మన గుండెల్లో గద్దర్ ఉన్నాడు. వైఎస్ఆర్ కూతురిగా గద్దర్ తనను కూడా చాలా అభిమానించే వారు అంటూ ఆయన్ను వైఎస్ షర్మిల స్మరించుకున్నారు.

ఇది కూడా చదవండి : Gaddar's Son About His father's Last Wish: మా నాన్న చివరి కోరిక ఇదేనన్న గద్దర్ తనయుడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News