Earthquake: మలేషియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో తెల్లవారుజామున భారీ భూకంపం

Earthquake: ఆ రెండు దేశాల్లో ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత భారీగానే నమోదైంది. పెద్దఎత్తున ఆస్థినష్టం జరిగినట్టు తెలుస్తోంది. భయంతో ప్రజలు రోడ్లపై పరుగులు తీశారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 14, 2022, 06:48 AM IST
 Earthquake: మలేషియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో తెల్లవారుజామున భారీ భూకంపం

Earthquake: ఆ రెండు దేశాల్లో ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత భారీగానే నమోదైంది. పెద్దఎత్తున ఆస్థినష్టం జరిగినట్టు తెలుస్తోంది. భయంతో ప్రజలు రోడ్లపై పరుగులు తీశారు.

అటు మలేషియా..ఇటు ఫిలిప్పీన్స్. రెండు దేశాల్లోనూ అర్ధరాత్రి దాటిన తరువాత భారీ భూకంపాలు నమోదయ్యాయి. మలేషియా రాజధాని కౌలాలంపూర్ సమీపంలో 6.8 తీవ్రత నమోదు కాగా..ఫిలిప్పీన్స్‌లో 6.4 తీవ్రత నమోదైంది. రెండు దేశాల్లోనూ రిక్టర్ స్కేలుపై తీవ్రత 6 దాటడంతో ఆస్థినష్టం భారీగా జరిగి ఉంటుందని అంచనా. ఇప్పటి వరకూ ఎటువంటి సమాచారం ఇంకా లభించలేదు. అటు ప్రాణనష్టం మాత్రం లేదని తెలుస్తోంది. 

కౌలాలంపూర్ నగరానికి నైరుతి దిశలో..504 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ రెండు దేశాల్లో దాదాపు ఒకే సమయంలో అంటే అర్ధరాత్రి దాటిన తరువాత తెల్లవారుజామున 2 గంటల 40 నిమిషాలకు భూకంపం సంభవించింది. తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు భయంతో ఇళ్లలోంచి బయటకు వచ్చి రోడ్లపై పరుగులు తీశారు. అటు ఫిలిప్పీన్‌లోని మనీలా రాజధానికి 157 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్తతో భూకంపకేంద్రం గుర్తించారు. రెండు దేశాల్లోనూ ఒకేసారి రెండు భూకంప కేంద్రాలతో భూమి కంపించడంపై కారణాలను భూగర్భ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అటు ఈ భూకంపం కారణంగా రెండు దేశాల్లో ఆస్థినష్టం భారీగానే ఉండవచ్చని తెలుస్తోంది. 

Also read: Russia Ukraine War: పోలాండ్‌ సరిహద్దులో రష్యా భీకర దాడులు... 35 మంది మృతి, 134 మందికి గాయాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News