Vellampalli Srinivas: ఏపీ దేవాదాయశాఖ మంత్రికి కరోనా!

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో కరోనా మహమ్మారి (Coronavirus) రోజురోజుకూ విజృంభిస్తూనే ఉంది. నిత్యం వేలాదిసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు.

Last Updated : Sep 28, 2020, 11:09 AM IST
Vellampalli Srinivas: ఏపీ దేవాదాయశాఖ మంత్రికి కరోనా!

Minister Vellampalli Srinivas tested Covid-19 positive: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో కరోనా మహమ్మారి (Coronavirus) రోజురోజుకూ విజృంభిస్తూనే ఉంది. నిత్యం వేలాదిసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇటీవలనే ఏపీలో ఎంపీలు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఏపీ దేవాదాయశాఖ మంత్రి, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ (Vellampalli Srinivas) కూడా కరోనా బారిన పడ్డారు. అయితే ఆయన విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన తిరుమల (TTD) బ్రహ్మోత్సవాల అనంతరం వెల్లంపల్లికి స్వల్ఫ లక్షణాలు కనిపించగా కరోనా పరీక్ష చేయించుకున్నట్లు చెబుతున్నారు. Also read: ఏపీ సీఎం YS Jaganకు ధన్యవాదాలు: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

ఇదిలాఉంటే.. బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలోనే ఉండి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నీ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తిరుమలకు వచ్చి.. కార్యక్రమం ముగిసి వెళ్లే వరకు మంత్రి వెల్లంపల్లి ఆయన వెన్నంటే ఉన్నారు. అనంతరం ఈనెల 25న తిరిగి విజయవాడకు చేరుకున్న మంత్రి స్వల్ప అస్వస్థకు గురి కాగా.. వెల్లంపల్లి కరోనా పరీక్ష చేయించుకున్నారని పేర్కొంటున్నారు. అయితే.. బ్రహ్మోత్సవాల సమయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి వెన్నంటే ఉన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కి కరోనా పాజిటీవ్‌గా తేలడంతో ప్రస్తుతం ఆందోళన నెలకొంది. 

 

Trending News