మీరు తినే ఆహారం మీ చర్మంపై కచ్చితంగా ప్రభావాన్ని చూపుతుంది. షోషకాలు లేని ఆహారం పలు చర్మ సమస్యలకు దారి తీస్తుంది. మీది పొడి చర్మం అయితే మీరు తగినంత కొవ్వును తినడం లేదని సూచిస్తుంది. పొడి చర్మం ఉన్నవారు బీటా కెరోటిన్, జింక్, విటమిన్ హెచ్, ఒమేగా -3, ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలున్న ఆహారాన్ని తినాలని సూచిస్తారు.
చర్మం నిర్జలీకరణం (Dehydration) వల్ల పొడి చర్మం అవుతుంది. శరీరంలో 70 శాతానికి పైగా నీరు ఉంటుంది. అందుకోసం అధికంగా నీరు తాగితే మీ చర్మం తేమ నిల్వను పెంచుతుంది. చల్లని పొడి వాతావరణం, అలర్జీ ఆహారం, థైరాయిడ్ చురుకుదనం మరియు మధుమేహం లాంటి అంశాలు చర్మాన్ని పొడిగా మారుస్తాయి. పొడి చర్మం సమస్యను ఎదుర్కోవడానికి 5 ఉత్తమ ఆహార పదార్థాలు ఇక్కడ అందిస్తున్నాం. (best foods to combat dry skin) (Image: thehealthsite)
కొవ్వు అధికంగా ఉండే చేపలు తినాలి. సాలమన్ (salmon fishes For SinCare), మకెరల్, హెర్రింగ్ చేపలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పొడి చర్మం సమస్యను దూరం చేస్తాయి. ఈ చేపలలో చర్మానికి అత్యంత అవసరమైన విటమిన్ ఈ సైతం లభిస్తుంది.
అవొకాడో(Avocado)లో చర్మానికి కావలసిన కొవ్వులు లభిస్తాయి. దీనివల్ల మీ చర్మం మృదువుగా, తేమగా మారుతుంది. అవొకాడోలలో విటమిన్ సి, విటమిన్ ఈ ఉంటుంది. ఇవి మీ చర్మాన్ని పాడవకుండా రక్షిస్తాయి.
పొద్దుతిరుగుడు విత్తనాలు (Sunflower Seeds)లో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది. ఇవి తరచుగా తింటే చర్మ సమస్యలు దూరం చేస్తుంది. మీ చర్మ పొడిబారకుండా కాపాడతాయి. ఒక ఔన్స్ (28 గ్రాములు) పొద్దుతిరుగుడు విత్తనాలు తింటే 49 శాతం విటమిన్ ఈ మనకు లభిస్తుంది.
బ్రకోలి (Broccoli)లో చర్మానికి అవసరమయ్యే విటమిన్లు, ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి. బ్రకోలి తింటే జింక్, విటమిన్ ఏ, విటమిన్ సి శరీరానికి అందుతుంది. ఇందులో ఉండే ల్యూటిన్, కార్టోనాయిడ్స్ ఆక్సిడేట్ డ్యామేజ్‌ను తగ్గించి చర్మాన్ని పొడిబారకుండా (Broccoli is important for skin health) రక్షిస్తుంది.
మీ శరీరాన్ని పొడిబారకుండా మృదువుగా, తేమగా ఉంచే మరో ఆహార పదార్థం టమాటోలు (Tomatoes). వీటితో ఉండే ‘విటమిన్ సి’ చర్మాన్ని సంరక్షిస్తుంది. బీటా కెరోటిన్, లైకోపిన్, ల్యూటిన్ వంటి కార్టోనాయిడ్స్ మన శరీరానికి పుష్కలంగా లభిస్తాయి. టమాటోలు తగిన మోతాదులో తింటే సూర్యరశ్మి నుంచి కాపాడుతుంది.