Andhra Pradesh: ఏలూరులో వింత వ్యాధి కలకలం.. ఆందోళనలో ప్రజలు

ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) పశ్చిమగోదావరి జిల్లాలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. (West Godavari) జిల్లా కేంద్రమైన ఏలూరులో చాలామంది ఉన్నట్టుండి స్పృహతప్పి పడిపోవడం, నోట్లో నుంచి నురగలు రావడం, మూర్ఛపోవడం, వాంతులు లాంటి కారణాలతో శనివారం నుంచి ఆసుపత్రుల్లో చేరుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది.

Last Updated : Dec 6, 2020, 04:33 PM IST
Andhra Pradesh: ఏలూరులో వింత వ్యాధి కలకలం.. ఆందోళనలో ప్రజలు

strange disease spread in eluru AP: అమరావతి: ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) పశ్చిమగోదావరి జిల్లాలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. (West Godavari) జిల్లా కేంద్రమైన ఏలూరులో చాలామంది ఉన్నట్టుండి స్పృహతప్పి పడిపోవడం, నోట్లో నుంచి నురగలు రావడం, మూర్ఛపోవడం, వాంతులు లాంటి కారణాలతో శనివారం నుంచి ఆసుపత్రుల్లో చేరుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. అయితే ఈ వింత వ్యాధి ఏంటన్నది కూడా వైద్యులు కూడా ఏం చెప్పలేకపోతున్నారు. ముందుగా ఏలూరు వన్‌టౌన్‌లోని దక్షిణ వీధిలో కొంతమంది (strange disease) ఇలాంటి లక్షణాలతో శనివారం ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత ఆదివారం కూడా ఆసుపత్రుల్లో (strange disease spread in eluru) చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ( Y. S. Jaganmohan Reddy ) ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు. 

ఏలూరులో వింత వ్యాధిఈ అంతుచిక్కని వ్యాధితో ఏలూరు ( eluru ) ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన బాధితులను డిప్యూటీ సీఎం, వైద్యశాఖ మంత్రి ఆళ్ళనాని (alla nani) పరామర్శించారు. ఈ వ్యాధితో ఇప్పటివరకూ 227 మంది అస్వస్థత చెందినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రితోపాటు.. ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా బాధితులు చేరారని ఆయన తెలిపారు. ఇప్పటివరకూ 70 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఈ వ్యాధి బారిన పడిన వారిలో పురుషులు, మహిళలు, చిన్నపిల్లలు సైతం ఉన్నారని, వారందరికీ చికిత్స అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని.. కొంతమంది పరిస్థితి విషమంగా ఉంటే వారిని విజయవాడ తరలించామని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. Also read: Bharat Bandh: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

బాధితుల రక్తపరీక్షల శ్యాంపిల్స్‌ను నిపుణులతో పరిశీలిస్తున్నామని ఆళ్లనాని వివరించారు. అయితే దీనికి నీటి కాలుష్యమా, గాలి కాలుష్యమా అన్నది తెలియాల్సి ఉంది. కల్చర్ సెల్స్ సెన్సిటివిటి టెస్ట్ రిపోర్ట్ వస్తేనే క్షుణ్ణంగా దీనిగురించి తెలుస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే ఈ వ్యాధిని మానసిక వైద్యులు మాస్ హిస్టిరియా (mass hysteria) గా పేర్కొంటున్నారు. ఈ వ్యాధి ప్రబలుతున్న ప్రాంతాల్లో అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. 

 

Also Read| Tejashwi Yadav: ఆర్జేడీ నేత తేజస్వీతోపాటు 518 మందిపై కేసు

Also read | Rashmika Mandanna: కాటుక కళ్లతో కవ్విస్తున్న రష్మిక..

 

Also Read | 2021 జనవరి నుంచి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు రూల్స్‌లో మార్పు, పూర్తి వివరాలు చదవండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News