Crime News: ఆరోగ్యం బాగోలేదని కూతురిని ఆసుపత్రికి తీసుకువెళితే.. దిమ్మతిరిగే నిజాలు చెప్పిన వైద్యులు

Uttar Pradesh Crime: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఆ గర్భం దాల్చగా.. రెండుసార్లు అబార్షన్ మాత్రలు మింగించి.. మళ్లీ అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2024, 06:06 PM IST
Crime News: ఆరోగ్యం బాగోలేదని కూతురిని ఆసుపత్రికి తీసుకువెళితే.. దిమ్మతిరిగే నిజాలు చెప్పిన వైద్యులు

Uttar Pradesh Crime: తమ కుమార్తెకు ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి తీసుకువెళితే.. వైద్యులు చెప్పిన మాటలు విని తల్లిదండ్రులు షాక్ అయ్యారు. బాలికకు గర్భవతి అని చెప్పడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. ఓ యువకుడు బాలికపై అత్యాచారం చేసినట్లు తెలుసుకున్నారు. బాలిక రెండుసార్లు గర్భస్రావం అయినట్లు వైద్యులు తెలిపారు. బాలికతో అబార్షన్ మాత్రలు మింగించి పలుసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు తల్లిదండ్రులు తెలుసుకున్నారు. దీంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా..

నిందితుడు అజం ఉత్తరప్రదేశ్‌లోని షెర్కోట్ నజీబాబాద్‌ నివాసి. వెల్డింగ్ పనులు చేస్తూ.. సహస్‌పూర్ ప్రాంతంలో అద్దెకు ఉంటున్నాడు. రెండు నెలల క్రితం అదే ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఆ బాలికపై పలుమార్లు బలవంతంగా అత్యాచారం చేశాడు. బాలిక గర్భం దాల్చడంతో మైనర్‌కు అబార్షన్ మాత్రలు మింగించాడు. ఇటీవల బాలిక ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. 

దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలికకు అబార్షన్ అయినట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. బాలికను గట్టిగా నిలదీయగా.. ఓ యువకుడు అత్యాచారం చేసినట్లు చెప్పింది. రెండుసార్లు అబార్షన్ మాత్రలు ఇచ్చాడని తెలిపింది. ఒక్కసారిగా షాక్‌కు గురైన కుటుంబసభ్యులు.. గురువారం రాత్రి గురువారం రాత్రి సహస్‌పూర్ పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి తండ్రి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. నిందితుడిపై పోక్సో, అత్యాచారం, హత్య చేస్తానని బెదిరించడం, అబార్షన్‌కు ప్రేరేపించడం వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. కోర్టులో నిందితుడిని హాజరుపరిచి.. జ్యుడీషియల్ కస్టడీలో జైలుకు పంపించినట్లు వెల్లడించారు.   

Also Read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..

Also Read:  Washing Machine Offers: ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.3,990కే రియల్‌ మీ 8.5 Kg Top Load వాషింగ్‌ మెషిన్‌..   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News