realme TechLife 8.5 kg 5 Star Price Dropped: ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.3,990కే రియల్‌ మీ 8.5 Kg Top Load వాషింగ్‌ మెషిన్‌..

realme TechLife 8.5 kg 5 Star Price Dropped: తక్కువ ధరలో వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ఫ్లిప్‌కార్ట్‌ కొన్ని వాషింగ్‌ మెషిన్స్‌ను భారీ డిస్కౌంట్‌తో అందిస్తోంది.    

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2024, 09:14 AM IST
realme TechLife 8.5 kg 5 Star Price Dropped: ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.3,990కే రియల్‌ మీ 8.5 Kg Top Load వాషింగ్‌ మెషిన్‌..

 

Washing Machine Offers: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బచత్‌ సేల్‌ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా కొన్ని బ్రాండ్‌కి సంబంధించిన పరికరాలపై ప్రత్యేక డిస్కౌంట్‌ లభిస్తోంది. అంతేకాకుండా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సేల్‌లో భాగంగా కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన వాషింగ్‌ మెషిన్స్‌ కొనుగోలు చేస్తే డెడ్‌ చీప్‌ ధరల్లో పొందవచ్చు. అయితే ఈ సేల్‌లో ఏ వాషింగ్‌ మెషిన్‌ అత్యంత చౌకగా లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

బిగ్ బచత్‌ సేల్‌లో భాగంగా realme TechLife 8.5 kg 5 Star వాషింగ్‌ మెషిన్‌పై ప్రత్యేక డిస్కౌంట్‌ లభిస్తోంది. ప్రస్తుతం ఈ వాషింగ్‌ మెషిన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో MRP ధర రూ.18,990తో అందుబాటులో ఉంది. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా 47 శాతం తగ్గింపుతో కేవలం రూ.9,990కే లభిస్తోంది. దీంతో పాటు అదనపు తగ్గింపు పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

బ్యాంక్‌ ఆఫర్స్‌:
realme TechLife 8.5 kg 5 Star వాషింగ్‌ మెషిన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లోని అదనపు తగ్గింపుతో పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఈ బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా IDFC FIRST బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి ఈ వాషింగ్‌ మెషిన్‌ బిల్ చెల్లిస్తే దాదాపు రూ.1,750 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు OneCard,  Bank of Baroda, Flipkart యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించి బిల్ చెల్లించిన రూ.1,250 వరకు తగ్గింపు లభిస్తుంది. 

Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..

ఎక్చేంజ్‌ ఆఫర్స్‌:
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ వాషింగ్ మెషిన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించి కొనుగోలు భారీ తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్‌ను వినియోగించడానికి ముందుగా మీరు వినియోగిస్తున్న పాత వాషింగ్‌ మెషిన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.6,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్‌ పోను ఈ రియల్‌ మీ TechLife 8.5 kg 5 Star వాషింగ్‌ మెషిన్‌ రూ.3,990కే పొందవచ్చు. 

Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News