Ayodhya Ram Mandir Nearby Places To Visit: ఇప్పుడు భారతదేశంలో చూడాల్సిన పర్యాటక ప్రదేశాల్లో అయోధ్య కూడా ఒకటి. ఉత్తరప్రదేశ్‌లోగని అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ఠి వేడుకలు ప్రారంభమయ్యాయి. జనవరి 22వ తేదీన రాంలాలాను ఆలయంలో ప్రతిష్ఠిస్తారు. ఈ సందర్భంగా ప్రముఖులు, టూరిస్టులతో అయోధ్య పట్టణమంతా పండగ వాతావరణం నెలకొంది. అలాగే ప్రపంచ నలుమూలల నుంచి అయోధ్యలోని రామ మందిరాన్ని చూసేందుకు తరలివస్తున్నారు. మీరు కూడా అయోధ్య వెళ్తున్నారా? అయితే అయోధ్య వెళ్లాలనుకునేవారు అయోధ్య రామ మందిరాన్ని సందర్శించడమే కాకుండా మేము తెలిపిన టాప్ మోస్ట్ టూరిజం ప్లేస్ లకు వెళ్లి ఆనందించండి.
రామ జన్మభూమి:
అయోధ్య పట్టణానికి పేరు రావడానికి ప్రధాన కారణం ఆ నగరంలో శ్రీరాముడు జన్మించడం.. అందుకే అయోధ్య పట్టణాన్ని భారతీయులు రామ జన్మభూమిగా పిలుస్తారు. ఇంతకుముందు ఈ స్థలంలో బాబ్రీ మసీదు ఉండేది. దీనిని 1992లో కొంతమంది హిందూ జాతీయవాదులు కూల్చివేశారు. చాలా ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు ఈ బాబ్రీ మసీదు పై తీర్పు వెల్లడించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం బాబ్రీ మసీదు ప్రాంతంలోని రామ మందిరాన్ని నిర్మించింది. ఈ రామ మందిరానికి సంబంధించిన పనులు పూర్తి కావడంతో ఈ నెల 22వ తేదీన శ్రీరాముడు ఆలయంలో కొలువు తీరానున్నారు. భక్తులకు శ్రీరాముని దర్శన ప్రక్రియను రామ జన్మభూమి ట్రస్ట్ జనవరి 22 ఉదయం 8 గంటల నుంచి ప్రారంభించబోతోంది.
నాగేశ్వరనాథ్ ఆలయం:
భారతదేశంలో ఎంతో ప్రసిద్ధమైన ఆలయాల్లో నాగేశ్వరనాథ్ ఆలయం ఒకటి. ఇది అయోధ్య జంక్షన్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని తేరి బజార్ సమీపంలో ఉంటుంది. ఈ ఆలయంలో మహాశివుడు కొలువుదీరి ఉన్నాడు. కొన్ని శతాబ్దాలకు ముందే ఈ దేవాలయంలో శివలింగాన్ని ప్రతిష్టించారు. స్థానికుల కథనం ప్రకారం.. ఈ శివలింగాన్ని సాక్షాత్తు శ్రీరాముడి చిన్న కుమారుడు పురుషుడు స్థాపించాడట. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు తెరుచుకొని ఉంటుంది.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
గులాబీ తోట:
గులాబి బారి అనేది అయోధ్యలోని ఫైజాబాద్‌లోని వైదేహి నగర్ ప్రాంతంలో ఉన్న ఒక సమాధి.. ఇది ఉత్తరప్రదేశ్లో ఎంతో ఫేమస్ అయిన పర్యాటక ప్రదేశం.. ఇక్కడ ఎన్నో రంగుల గులాబీ పూల చెట్లతో పాటు.. ఎటు చూసినా కళ్ళకు పచ్చదనమే కనిపిస్తుంది. ఈ గులాబీ బారి అవధ్ 3వ నవాబు షుజా-ఉద్-దౌలాచే స్థాపించారని సమాచారం. ఈ పర్యాటక ప్రదేశం ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు తెరుచుకొని ఉంటుంది.
గుప్తర్ ఘాట్:
అయోధ్యలోని చూడాల్సిన పర్యాటక ప్రదేశాల్లోని గుప్తర్ ఘాట్ ఒకటి. ఇది అయోధ్యలోని ఫైజాబాద్‌లో సరయూ నది ఒడ్డున ఉన్న ఎంతో పవిత్రమైన స్థలం. అయోధ్యలోని ధార్మిక ప్రదేశాలలో ఒకటైన గుప్తర్ ఘాట్ భక్తులతో ఎప్పుడు కిటకిటలాడుతూ ఉంటుంది. అంతేకాకుండా శ్రీరాముడు ఈ ఘాట్ నుంచే తిరిగి వైకుంఠానికి వెళ్ళాడని అక్కడి ప్రజల నమ్మకం.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter