Project K Update: హాలీవుడ్ రేంజ్‌లో 'దీపికా' ఫస్ట్ లుక్... అంచనాలు పెంచేసిన 'ప్రాజెక్టు-కె'..

Project K: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ చిత్రం 'ప్రాజెక్టు-కె'. ఈ భారీ బడ్జెట్ సినిమా నుంచి దీపికా పదుకొణె ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో ఫ్యాన్స్ పుల్ జోష్ లో ఉన్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 18, 2023, 07:51 AM IST
Project K Update: హాలీవుడ్ రేంజ్‌లో 'దీపికా' ఫస్ట్ లుక్... అంచనాలు పెంచేసిన 'ప్రాజెక్టు-కె'..

Project K Movie Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్డెట్ మూవీ 'ప్రాజెక్టు-కె'. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ వరల్డ్ సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, సౌత్ స్టార్ హీరో కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశాపటానీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ఎప్పుడు రివీల్ అవుతుందా, దీని గ్లింప్స్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుండి దీపికా పదుకొణె ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో దీపికా లుక్ మాత్రం హాలీవుడ్ రేంజ్‌లో ఉంది.

మరో రెండు రోజుల్లో 'ప్రాజెక్ట్-కె’ మూవీ టైటిల్‌, గ్లింప్స్ ను అంతర్జాతీయ వేదికపై గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రేపటి (జూన్ 19) నుండి అమెరికాలోని శాన్ డియాగోలో కామిక్ కాన్ వేడుకల జరగనున్నాయి. ఆ కార్యక్రమంలోనే జులై 20న ప్రాజెక్ట్‌-కె టైటిల్‌తోపాటు గ్లింప్స్ కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ వేడుకల్లో ప్రభాస్‌తోపాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత అశ్వినీదత్ కూడా పాల్గొననున్నారు. దీనికి సంబంధించి మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దీనిపై  అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Vijay Deverakonda Emotional Speech: బేబీ నన్ను బాగా డిస్టర్బ్ చేసింది : విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్

రీసెంట్ గా ప్రభాస్ నటించిన ‘సలార్’ సినిమాకి సంబంధించి టీజర్ విడుదల కాగా.. ఇప్పుడు ‘ప్రాజెక్ట్-కె’ గ్లింప్స్ కూడా వస్తుందని తెలియడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.  'ప్రాజెక్ట్ కె'లో కె... అంటే 'కాలచక్రం' (KaalChakra) అని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇది నిజమా కాదా అని తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సుమారు రూ.500 కోట్లతో సి. అశ్వినీదత్ నిర్మిస్తున్నారు.

Also read: Expensive Films Than Chandrayaan 3: చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ కంటే ఎక్కువ బడ్జెట్‌తో తీసిన సినిమాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News