Expensive Films Than Chandrayaan 3: చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ కంటే ఎక్కువ బడ్జెట్‌తో తీసిన సినిమాలు

Most Expensive Films Than Chandrayaan 3: ఇండియాకు ఇంత పేరు తీసుకొచ్చిన చంద్రయాన్ 3 మిషన్ ఖరీదు కొన్ని భారీ బడ్జెట్ సినిమాలకు అయిన ఖర్చు కంటే కూడా తక్కువే. ఇంతకీ ఆ భారీ బడ్జెట్ సినిమాలు ఏవి, వాటికి ఎంత ఖర్చు అయిందో తెలియాలంటే ఇదిగో ఈ డీటేల్స్ లోకి వెళ్లాల్సిందే.

Written by - Pavan | Last Updated : Jul 17, 2023, 10:21 PM IST
Expensive Films Than Chandrayaan 3: చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ కంటే ఎక్కువ బడ్జెట్‌తో తీసిన సినిమాలు

Most Expensive Films Than Chandrayaan 3: చంద్రయాన్ 3 లాంచింగ్ విజయవంతం అవడంతో ఇప్పుడు యావత్ ప్రపంచం ఇండియా వైపు చూస్తోంది. ప్రపంచ అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ ని సగర్వంగా తలెత్తుకుని నిలబడేలా చేయడంలో ఇస్త్రో శాస్త్రవేత్తల కృషి ఎంతో ఉంది. మరి ఇంతకీ ఈ చంద్రయాన్ 3 మిషన్ పూర్తి చేయడానికి ఎంత ఖర్చయింది అనే విషయం మీలో ఎంతమందికి తెలుసు ? మిషన్ చంద్రయాన్ 3 ప్రాజెక్టు బడ్జెట్ ని కొంతమంది ఔత్సాహికులు సినిమా బడ్జెట్స్ తో పోల్చిచూస్తున్నారు. 

సదరు ఔత్సాహికులు చెబుతున్న లెక్కల ప్రకారం.. ఇండియాకు ఇంత పేరు తీసుకొచ్చిన చంద్రయాన్ 3 మిషన్ ఖరీదు కొన్ని భారీ బడ్జెట్ సినిమాలకు అయిన ఖర్చు కంటే కూడా తక్కువే. ఇంతకీ ఆ భారీ బడ్జెట్ సినిమాలు ఏవి, వాటికి ఎంత ఖర్చు అయిందో తెలియాలంటే ఇదిగో ఈ డీటేల్స్ లోకి వెళ్లాల్సిందే.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన మిషన్ చంద్రయాన్ - 3 కోసం మొత్తం 615 కోట్లు ఖర్చయింది. ఇన్ని సవాళ్లతో కూడిన ప్రాజెక్టు ఈ బడ్జెట్ లో పూర్తి కావడం అంటే గొప్ప విషయమే అని ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తిగా అవగాహన ఉన్న శాస్త్రవేత్తలు చెబుతున్న అభిప్రాయం. అయితే, మీరు ఇండియాలో తెరకెక్కిన కొన్ని సినిమాల విషయానికొస్తే.. వాటికి అయిన ఖర్చు చంద్రయాన్ - 3 మిషన్ కంటే ఎక్కువే ఉంది. 

ఆ భారీ బడ్జెట్ సినిమాలు ఏంటంటే ...

ఆర్ఆర్ఆర్ మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా ?
దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ కోసం ఆ చిత్ర నిర్మాత, డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత డీవీవీ దానయ్య మొత్తం రూ. 630 కోట్లు ఖర్చు చేశాడు. అందులో రూ. 500 కోట్లు ఆర్ఆర్ఆర్ మూవీ మేకింగ్ బడ్జెట్ కాగా.. మరో రూ. 50 కోట్లు సినిమా ప్రమోషన్స్ కోసం కేటాయించారు. ఇదే కాకుండా ఆస్కార్ అవార్డ్స్ క్యాంపెయిన్ కోసం మరో రూ. 80 కోట్లు వెచ్చించినట్టు నిర్మాత డీవీవీ దానయ్య చెప్పారు. అంటే ఈ సినిమా కోసం ఆ నిర్మాత పెట్టిన మొత్తం బడ్జెట్ రూ. 630 కోట్లు అన్నమాట.

ఆదిపురుష్ బడ్జెట్ ఎంతంటే..
ప్రభాస్, కృతి సనన్ శ్రీరాముడు, సీత పాత్రల్లో, సైఫ్ అలీ ఖాన్ రావణసురుడి పాత్రలో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ ఈ జాబితాలో మొదటి జాబితాలో ఉంది. ఓం రావత్ డైరెక్ట్ చేసిన ఆదిపురుష్ మూవీ కోసం రూ. 500 బడ్జెట్ అనుకున్నారు. కానీ ఆ తరువాత దాదాపు మరో రూ. 200 కోట్లు ఆదిపురుష్ మూవీ గ్రాఫిక్స్ క్వాలిటీ పెంచడం కోసం VFX, CGI , ప్రమోషన్స్, మార్కెటింగ్ కోసం ఖర్చు చేశారు. దీంతో సినిమా బడ్జెట్ మొత్తం రూ. 700 కోట్లకు చేరుకుంది.

ప్రాజెక్ట్ కే బడ్జెట్ కూడా అదే బాటలో
ప్రభాస్, దీపికా పదుకునె ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే మూవీ బడ్జెట్ కూడా రూ. 600 కోట్లుగా ఉంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా పూర్తయి, ప్రమోషన్స్, మార్కెటింగ్ అన్ని కలిపి ఈజీగా 700 కోట్ల రూపాయల బడ్జెట్ దాటుతుంది అని ఇండస్ట్రీ బాక్సాఫీస్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x