Sai Dharam Tej: మెగా మేనల్లుడి మూవీ నుంచి తప్పుకున్న బన్నీ హీరోయిన్!

Sai Dharam Tej Latest Movie News Updates | లాక్‌డౌన్‌కు ముందు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ సినిమాకు హీరోయిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ సినిమాకు డేట్స్ కుదరవు, తప్పక తప్పుకోవాల్సి వస్తుందని ఈ అమ్మడు నిర్ణయం తీసుకుందట.

Last Updated : Nov 2, 2020, 11:24 AM IST
Sai Dharam Tej: మెగా మేనల్లుడి మూవీ నుంచి తప్పుకున్న బన్నీ హీరోయిన్!

కరోనా వైరస్ (CoronaVirus), లాక్‌డౌన్ కారణంగా ఎన్నో టాలీవుడ్ (Tollywood) సినిమాలు విడుదల జాప్యం జరిగింది. సీరియల్స్‌తో పాటు పలు సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి. దీంతో ప్రాజెక్టుల వ్యవహారం తలకిందులైపోయాయి. డేట్స్ కుదిరాయని ఓకే చెప్పాల్సిన సినిమాలు రిజెక్ట్ చేస్తున్నారు. హీరోలు, హీరోయిన్లతో పాటు కమెడియన్లు, దర్శకనిర్మాతల పరిస్థితి ఇందుకు భిన్నమేమీ కాదు. తాజాగా అలవైకుంఠపురంలో బ్యూటీ ఓ సినిమా నుంచి తప్పుకుంది. 

 

లాక్‌డౌన్‌కు ముందు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) లేటెస్ట్ సినిమాకు హీరోయిన్ నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుందట. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోవడంతో గతంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నివేదా పేతురాజ్ సిద్ధమైంది. సాయి ధరమ్ తేజ్ సినిమాకు డేట్స్ కుదరవు, తప్పక తప్పుకోవాల్సి వస్తుందని ఈ అమ్మడు నిర్ణయం తీసుకుందట. నివేదా పేతురాజ్‌కు సాయిధరమ్ తేజ్‌తో సినిమా చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా.. కాల్ షీట్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో సినిమా నుంచి తప్పుకుందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.

 

 దేవాకట్ట దర్శకత్వంలో తాను లేటెస్ట్ మూవీ చేస్తున్నానని సాయిధరమ్ తేజ్ ఇటీవల ప్రకటించడం తెలిసిందే. ఇందుకు సంబంధించి ట్విట్టర్‌లో ఫొటోలు సైతం షేర్ చేసుకున్నాడు. అయితే నివేదా తప్పుకోవడంతో ఆమె స్థానంలో ఇటీవల క్రేజీగా మారుతున్న మరో నటి ఐశ్వర్య రాజేష్‌ను ఎంపిక చేసుకున్నారని వినిపిస్తోంది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కనుందని టైటిల్ సైతం ఫిక్స్ చేశారని త్వరలో ప్రకటించబోతున్నారట. మూవీ యూనిట్ దీనిపై ఏ వివరాలు వెల్లడిస్తుందోనని వేచిచూడక తప్పదు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News