Pawan Kalyan Movie Shooting: రంగంలోకి దిగిన వకీల్ సాబ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్  ( Pawan Kalyan ) 26వ చిత్రం వకీల్ సాబ్ మూవీ షూటింగ్ ( Vakeel saab movie shooting ) లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్‌ను అన్‌లాక్ మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబరు నుంచి ప్రారంభించారు మూవీ మేకర్స్.

Last Updated : Nov 2, 2020, 06:00 AM IST
Pawan Kalyan Movie Shooting: రంగంలోకి దిగిన వకీల్ సాబ్

Pawan Kalyan is back to the Vakeel Saab sets: పవర్ స్టార్ పవన్ కల్యాణ్  ( Pawan Kalyan ) 26వ చిత్రం వకీల్ సాబ్ మూవీ షూటింగ్ ( Vakeel saab movie shooting ) లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్‌ను అన్‌లాక్ మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబరు నుంచి ప్రారంభించారు మూవీ మేకర్స్. అయితే పవన్ కళ్యాణ్ చతుర్మాస్య దీక్షలో ( Chaturmasya deeksha ) ఉన్నందున షూటింగ్‌కి హాజరు కాలేక పోయారు. ఈ క్రమంలో దాదాపు ఏడు నెలల విరామం తరువాత మళ్లీ వకీల్ సాబ్ సెట్‌లోకి అడుగుపెట్టారు పవన్ కల్యాణ్. 

ఆదివారం హైదరాబాద్ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ ( Vakeel Saab shooting ) ప్రారంభమైంది. సరూర్‌నగర్‌లోని ఓ పాఠశాలలో వేసిన కోర్టు సెట్‌లో పవన్‌ కల్యాణ్‌తో పాటు హీరోయిన్లు అంజలి, నివేథా థామస్‌, అనన్యలపై ముఖ్య ఘట్టాలను చిత్రీకరించారు. ఇంకో వారంపాటు ఈ సినిమా షూటింగ్ ఈ ప్రాంతంలోనే జరగనున్నట్లు సమాచారం. దీంతోపాటు ఈ సినిమాలో శృతిహాసన్‌ ( Shruti Haasan ) కూడా ప్రధాన పాత్రలో నటించనుంది. ఆమె కూడా ఈ నెలాఖరులో షూటింగ్‌లో భాగం కానున్నట్లు తెలిసింది.  Also read: Sai Pallavi, Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ సరసన సాయి పల్లవి ?

బాలీవుడ్‌లో బాగా ప్రశంసలు అందుకున్న 'పింక్' సినిమా రీమేకే వకీల్ సాబ్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. హిందీ వెర్షన్‌లో అమితాబ్ బచ్చన్ పోషించిన న్యాయవాది పాత్రలో పవన్ కల్యాణ్ నటిస్తున్నారు. ఈ సినిమాను వేణు శ్రీరామ్ (Venu Sriram ) డైరెక్ట్ చేస్తుండగా.. దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ ( SS Thaman ) అందిస్తున్నారు. అయితే ఈ సినిమాను సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్‌పై మూవీమేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. Also read: Pawan Kalyan 30వ సినిమా అప్డేట్ కూడా వచ్చేసిందోచ్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News