మైసూరు ఐటీ కమీషనర్ కార్యాలయం ముందు హాజరయిన హీరోయిన్ రష్మిక మందన్నా

హీరోయిన్ రష్మిక మందన్న మంగళవారం ఐటీ అధికారుల ముందు హాజరయ్యారు. కర్నాటకకు చెందిన రష్మిక సొంత గ్రామం కొడుగు జిల్లా విరాజ్ పేట్ లోని తన ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో రష్మిక నివాసం నుంచి ఆదాయపు పన్ను శాఖ అధికారులు రూ.25 లక్షల నగదు, వివిధ ఆస్తులకు సంబందించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

Last Updated : Jan 21, 2020, 07:15 PM IST
మైసూరు ఐటీ కమీషనర్ కార్యాలయం ముందు హాజరయిన హీరోయిన్ రష్మిక మందన్నా

బెంగళూరు : హీరోయిన్ రష్మిక మందన్న మంగళవారం ఐటీ అధికారుల ముందు హాజరయ్యారు. కర్నాటకకు చెందిన రష్మిక సొంత గ్రామం కొడుగు జిల్లా విరాజ్ పేట్ లోని తన ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో రష్మిక నివాసం నుంచి ఆదాయపు పన్ను శాఖ అధికారులు రూ.25 లక్షల నగదు, వివిధ ఆస్తులకు సంబందించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను రష్మిక తండ్రి ఐటీ అధికారులకు చూపించలేకపోవడంతో ఈ నెల 21న బెంగళూరు, మైసూరు కార్యాలయాల్లో హాజరై వీటి వివరాలు అందించాలని నోటీసులు జారీ చేశారు.

రష్మిక కూడా 1.5 కోట్లకు సంబందించి పన్ను చెల్లించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రష్మిక తన తండ్రి మదన్, తల్లి సుమన్‌తో కలిసి ఈరోజు మైసూర్‌లోని ఐటీ అధికారుల ముందు హాజరైనారు. 

ఇదిలావుంటే, రష్మిక తాజాగా మహేష్‌తో నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దీని తర్వాత అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో రష్మిక నటిస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News