'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్'.. తెలుగులో!

'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్'.. తెలుగులో!

Last Updated : Sep 26, 2018, 02:17 PM IST
'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్'.. తెలుగులో!

ఆమిర్ ప్రధాన పాత్రలో.. అమితాబ్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్'. తొలిసారి అమితాబ్-ఆమిర్ కలిసి నటిస్తున్న చిత్రం కావడంలో ఈ సినిమాపై బాలీవుడ్ లో అంచనాలు పెరిగాయి. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కో పాత్రకు సంబంధించి మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.  ఆమిర్ (ఫిరంగి). అమితాబ్ (ఖుధాబక్ష్), కత్రినా కైఫ్ (సురైయ్య), ఫాతిమా సనా షేక్‌(జఫీరా)లకు సంబంధించిన లుక్ లు రిలీజ్ అయ్యాయి. తాజాగా ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల చేస్తున్నట్లు తెలిపింది.

థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేస్తూ.. ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో స్టార్ హీరోలు ఆమిర్, అమితాబ్ సినిమాను ఈ దీపావళికి విడుదల చేస్తున్నట్లు.. అభిమానులు చూడాలని  కోరారు. తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల చేస్తున్న యాష్ రాజ్ ఫిల్మ్స్ పేర్కొంది.

విజయ్‌ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యష్ రాజ్‌ ఫిలింస్‌ నిర్మిస్తోంది. 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనలో ఇండియా నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. 1839 కాలం నాటి ఫిలిప్‌ మెడోస్‌ టేలర్‌ నవల ‘కన్ఫెషన్స్‌ ఆఫ్ థగ్’ ఆధారంగా  సినిమాను రూపొందించారు.

ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ సెప్టెంబర్ 27న విడుదలవుతుంది.

'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్, బ్రిటీష్ నటుడు లీవుడ్ ఓవెన్, జాకీ ష్రాఫ్, శశాంక్ అరోరా నటిస్తుండగా.. నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

 

Trending News