పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్

పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్

Last Updated : Sep 17, 2018, 04:26 PM IST
పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్

తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టే ఆలోచనే లేదని స్పష్టం చేశారు బాలీవుడ్‌ నటుడు ఆమిర్ ఖాన్‌(53). త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నారని, బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న కథనాలకు ఆయన ఈ వ్యాఖ్యలతో చెక్ పెట్టేశారు. ఆదివారం ఎన్డీటీవీ ఛానల్‌ నిర్వహించిన యూత్ కాన్క్లేవ్ ‘యువ’ అనే కార్యక్రమంలో ఆమిర్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తన రాజకీయ ప్రవేశం గురించి స్పష్టతనిచ్చారు.

‘రాజకీయాలంటే నాకు భయం. నేను సృజనాత్మకత రంగానికి చెందినవాడిని. నా ప్రతిభతో ప్రజల హృదయాలను గెలుచుకోగలను. రాజకీయాలు నాకు సరిపోవు.' అని  అమిర్ వ్యాఖ్యానించారు.

అనంతరం తాను ‘పానీ’ పేరిట స్థాపించిన స్వచ్ఛంద సంస్థ గురించి మాట్లాడుతూ..‘నేను స్థాపించిన సంస్థకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా  మద్దతు ఇస్తున్నారు. రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చాలంటే నా ఒక్కడి వల్లో లేక ప్రభుత్వం వల్లో జరిగే పని కాదు. ప్రజలందరూ కలిసికట్టుగా ఏర్పడి ఓ ఉద్యమంలా పోరాడితేనే రాష్ట్రాన్ని కరవు రహితంగా మార్చగలం’ అని ఆమిర్‌ అన్నారు.

అమిర్ ఖాన్ థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కత్రినా కైఫ్, అమితాబ్ బచ్చన్, ఫాతిమా సనా షేక్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.  ఈ చిత్రాన్ని యశ్ చోప్రా తనయుడు ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నాడు. 1839లో వచ్చిన ఒక నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీపావళి కానుకగా నవంబరు 7న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Trending News