G 20 Summit: జి 20 దేశాల సదస్సుకు హాజురుకానున్న ప్రధాని నరేంద్ర మోదీ

G 20 Summit: ఇటలీ దేశం రోమ్ వేదికగా మరి కొద్దిరోజుల్లో జీ 20 దేశాల శిఖరాగ్ర సమావేశం ప్రారంభం కానుంది. ఇండియా నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 25, 2021, 08:40 AM IST
  • అక్టోబర్ 30, 31 తేదీల్లో రెండ్రోజుల పాటు జి 20 దేశాల సదస్సు
  • ఇటలీ రోమ్ నగరంలో జరగనున్న జీ 20 దేశాల సదస్సుకు హాజరుకానున్న ప్రధాని మోదీ
  • యూకేలో అక్టోబర్ 31 నుంచి నవంబర్ 12 వరకూ కాప్ 26 దేశాధినేతల సదస్సు
G 20 Summit: జి 20 దేశాల సదస్సుకు హాజురుకానున్న ప్రధాని నరేంద్ర మోదీ

G 20 Summit: ఇటలీ దేశం రోమ్ వేదికగా మరి కొద్దిరోజుల్లో జీ 20 దేశాల శిఖరాగ్ర సమావేశం ప్రారంభం కానుంది. ఇండియా నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.

ఆఫ్ఘనిస్తాన్ దేశంలో జరుగుతున్న పరిణామాలు, వాతావరణ మార్పులు, మానవాళికి విసురుతున్న సవాళ్లు, కరోనా సంక్రమణ వంటి కీలకాంశాలే ఎజెండాగా జి 20 దేశాల సదస్సు ప్రారంభం కానుంది. ఇటలీలోని రోమ్ నగరంలో ఈ నెల 30, 31 తేదీల్లో రెండ్రోజులపాటు ఈ సదస్సు జరగనుంది. జీ 20 దేశాల(G20 Summit)16వ శిఖరాగ్ర సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ నెల 29 నుంచి నవంబర్ 2 వరకూ ఇటలీతో పాటు యునైటెడ్ కింగ్‌డమ్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. జీ 20 దేశాల సదస్సుతో పాటు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26  ప్రపంచ దేశాల అధినేతల సదస్సులో కూడా ప్రధాని మోదీ(PM Narendra Modi)పాల్గొననున్నారు. జీ 20 దేశాల కూటమికి ప్రస్తుతం ఇటలీ నేతృత్వం వహిస్తోంది. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఆఫ్ఘన్ దేశ పరిణామాలు, టెర్రరిజం వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది.1999 నుంచి జి 20 దేశాల సదస్సును ప్రతి యేటా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. కాప్ 26 సదస్సు ఈ నెల 31 నుంచి నవంబర్ 12 వరకూ యూకేలోని గ్లాస్గోలో జరగనుంది.

Also read: Poonch Encounter: జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ కాల్పులు.. గాయపడ్డ జవాన్, ఇద్దరు పోలీసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News