SBI Account Alert: ఎస్బీఐ అక్కౌంట్ ఉందా ..జర జాగ్రత్త, సైబర్ నేరగాళ్లు కన్నేశారు

SBI Account Alert: దేశంలో అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు అక్కౌంట్ ఉందా.. ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఎస్బీఐ ఎక్కౌంట్లను టార్గెట్ చేశారనే సమాచారం ఆందోళన కల్గిస్తోంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 2, 2021, 11:05 PM IST
  • ఎస్పీఐ ఎక్కౌంట్లను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు
  • మీ మొబైల్ నెంబర్‌కు వచ్చే టెక్స్ట్ మెస్సేజ్ వస్తే జాగ్రత్త
  • స్వయంగా కస్టమర్లను అప్రమత్తం చేసిన ఎస్బీఐ
SBI Account Alert: ఎస్బీఐ అక్కౌంట్ ఉందా ..జర జాగ్రత్త, సైబర్ నేరగాళ్లు కన్నేశారు

SBI Account Alert: దేశంలో అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు అక్కౌంట్ ఉందా.. ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఎస్బీఐ ఎక్కౌంట్లను టార్గెట్ చేశారనే సమాచారం ఆందోళన కల్గిస్తోంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( State bank of india). బ్యాంకుల విలీనం తరువాత కూడా అతి పెద్ద బ్యాంకు ఇదే. అందుకే ఎస్బీఐ( SBI)పై సైబర్ నేరగాళ్లు కన్నేశారు. నిజమే. స్వయంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ఈ విషయాన్ని వెల్లడించింది. సైబర్ నేరగాళ్లు ఎస్బీఐ ఖాతాలపై దృష్టి పెట్టారు. అందుకే ఎస్బీఐలో ఎక్కౌంట్ ఉంటే మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిందే. స్వయంగా బ్యాంకు తన కస్టమర్లను అలర్ట్ చేసింది. ఎస్బీఐ కస్టమర్లు 9 వేల 870  రూపాయల విలువైన ఎస్బీఐ క్రెడిట్ పాయింట్లను రిడీమ్ చేసుకోవాలంటూ హ్యాకర్లు టెక్స్ట్ మెస్సేజ్‌లు పంపిస్తున్నారు. ఈ మెస్సేజ్‌లో ఉన్న లింకుపై క్లిక్ చేసి పాయింట్లు రిడీమ్ చేసుకోవాలని మోసగాళ్లు ఎస్బీఐ కస్టమర్లకు మెస్సేజ్‌లు పంపిస్తున్నట్టు న్యూఢిల్లీకు చెందిన సైబర్ పీస్ ఫౌండేషన్, సైబర్ సెక్యూరిటీ థింక్ ట్యాంక్ తెలిపింది. 

మొబైల్ వచ్చిన మెస్సేజ్‌ను క్లిక్ చేస్తే నకిలీ వెబ్‌సైట్ ( SBI fake website) ఓపెన్ అవుతుంది. వెబ్‌సైట్ ల్యాండింగ్ పేజిలో పాయింట్లు రిడీమ్ చేసుకునేందుకు పేరు, రిజిస్టర్ మొబైల్ నెంబర్, ఈ మెయిల్, పుట్టిన తేదీ,  కార్డు నెంబర్, సీవీవీ, ఎంపిన్ వంటి వ్యక్తిగత ఆర్ధిక సమాచారాన్ని సమర్పించాలని కోరుతోంది. ఇందులో మీరు ఎస్బీఐ వివరాల్ని సమర్పిస్తే ఇక అంతే సంగతులు. మీ డేటాను మోసగాళ్లు తస్కరించి మీ బ్యాంక్ అక్కౌంట్‌లోని డబ్బులు ఖాళీ చేసేస్తారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మదాబాద్‌లలో ఉండే ఎస్బీఐ కస్లమర్లను మోసగాళ్లు టార్గెట్ చేసినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇటువంటి మెస్సేజ్‌లతో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 

Also read: Kangana ranaut: శివసేన నేతలతో ప్రాణహాని ఉంది..కేసులు బదిలీ చేయండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News