IPL 2023 Free Live streaming: ఐపిఎల్ 2023 క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఫ్రీ లైవ్ స్ట్రీమింగ్

IPL 2023 Free Live streaming: ఈసారి ఐపిఎల్ 2023 ని స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ మీడియా హౌజ్ సొంతం చేసుకోగా లైవ్ స్ట్రీమింగ్ రైట్స్ వయాకామ్ 18 జియో సినిమా కైవసం చేసుకుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి క్రికెట్ ప్రియులకు ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 11, 2023, 08:43 PM IST
IPL 2023 Free Live streaming: ఐపిఎల్ 2023 క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఫ్రీ లైవ్ స్ట్రీమింగ్

IPL 2023 Free Live streaming: ఐపిఎల్ 2023 క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్. ఐపిఎల్ ప్రియులకు 16వ ఐపిఎల్ టోర్నమెంట్‌ని ఉచితంగా వీక్షించే అవకాశం లభించనుంది. ఈ ఏడాది ఐపిఎల్ లైవ్ స్ట్రీమింగ్ రైట్స్ ని జియో సినిమా దక్కించుకుంది. ప్రాంతీయ భాషలు కూడా కలిపి మొత్తం 11 భాషల్లో లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి క్రికెట్ ప్రియులకు ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది.

ఈసారి ఐపిఎల్ 2023 ని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ మీడియా హౌజ్ సొంతం చేసుకోగా లైవ్ స్ట్రీమింగ్ రైట్స్ వయాకామ్ 18 జియో సినిమా కైవసం చేసుకుంది. అయితే, ఈసారి లైవ్ స్ట్రీమింగ్ ఉచితంగా అందివ్వాలని జియో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన లైవ్ స్ట్రీమింగ్ రైట్స్ ఉచితంగా అందివ్వడం ద్వారా జియో సినిమాకు ఏం లాభం అనే సందేహం రావచ్చునేమో! జియో సినిమా ఐపిఎల్ 2023 ని ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్ చేయడం ద్వారా భారీ సంఖ్యలో సబ్‌స్క్రిప్షన్స్ పెంచుకోవచ్చు అనేది జియో సినిమా ప్లాన్‌గా తెలుస్తోంది.

Trending News