KKR vs RCB: మొహమ్మద్ సిరాజ్ రికార్డుల మోత

ఐపీఎల్ సీజన్ 13లో అన్నీ అద్భుతాలే జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ పేసర్ మొహమ్మద్ సిరాజ్  సంచలనం రేపాడు. పర్ఫెక్స్ బంతులతో ప్రత్యర్ది టీమ్ ను కకావికలం చేసేశాడు. 

Last Updated : Oct 21, 2020, 10:54 PM IST
KKR vs RCB: మొహమ్మద్ సిరాజ్ రికార్డుల మోత

ఐపీఎల్ సీజన్ 13 ( IPL Season 13 ) లో అన్నీ అద్భుతాలే జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bengaluru )  టీమ్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ( Mohammed Siraj )  సంచలనం రేపాడు. పర్ఫెక్స్ బంతులతో ప్రత్యర్ది టీమ్ ను కకావికలం చేసేశాడు. 

ఐపీఎల్ 2020 ( IPL 2020 ) లో భాగంగా అబుదాబి ( Abudabi ) లో ఇవాళ కోల్ కత్తా నైట్ రైడర్స్ ( Kolkata knight riders ) వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bengaluru ) మ్యాచ్ నిజంగా ఓ అద్భుతం. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ ఉంటే ఏమైనా చేయవచ్చని నిరూపించింది టీమ్ బెంగళూరు. ఈ జట్టుకు లభించిన ఆణిముత్యం అటువంటిది. టీమ్ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ చేసిన మ్యాజిక్ అది. పవర్ ఫుల్ బౌలింగ్ తో కోల్ కత్తా టీమ్ ను పెవిలియన్ కు పంపించాడు. 

మొహమ్మద్ సిరాజ్ చేసిన 4 ఓవర్లలో 2 మెయిడెన్ ఓవర్లున్నాయి. కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 3 వికెట్లు తీసి కోల్ కత్తా జట్టు ( KKR Team ) నడ్డి విరిచాడు. మొత్తం డాట్ బాల్స్ సంఖ్య 16. ఒక్క బౌండరీ కూడా ప్రత్యర్ధికి చేజార్చలేదు. మొదటి ఓవర్ మూడోబంతికి రాహల్ త్రిపాఠీను ఔట్ చేసిన సిరాజ్..తరవాతి బంతికి నితీష్ రాణాను పెవిలియన్ బాట పట్టించాడు. ఇక నాలుగో ఓవర్ మూడో బంతికి టామ్ బాటన్ వికెట్ తీసి కోల్ కత్తా ఆశలపై నీళ్లు చిమ్మాడు. ఐపీఎల్ 2020 లో ఆడిన 4 మ్యాచ్‌లలో మహమ్మద్ సిరాజ్ 6 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2020 టోర్నీలో 4 మ్యాచ్‌లు ఆడిన మహమ్మద్ సిరాజ్ 6 వికెట్లు పడగొట్టాడు. అందులో మూడు వికెట్లు ఈ మ్యాచ్‌లో తీసినవే కావడం విశేషం.ఈ మ్యాచ్ లో సిరాజ్ తన అద్భుతమైన స్పెల్ ద్వారా చేసిన రికార్డు ఇలా ఉంది. Also read: Dwayne Bravo: ఐపీఎల్ 2020 నుంచి డ్వేన్ బ్రావో ఔట్

సిరాజ్ సృష్టించిన రికార్డులు

ఐపీఎల్ చరిత్రలో ఒకే మ్యాచ్ లో 2 ఓవర్లు మెయిడెన్ చేసిన మొట్టమొదటి బౌలర్ 

స్పెల్ లో ఫస్ట్ రన్ ఇవ్వకుండానే మూడు వికెట్లు తీసిన ఘనత

ఫస్ట్ రన్ ఇవ్వడానికి ముందు 12 డాట్ బాల్స్ వేసిన ఖ్యాతి దక్కించుకున్న బౌలర్ గా సిరాజ్

ఓ వైపు సిరాజ్ అద్భుత బౌలింగ్ రికార్డులు సృష్టిస్తే..మరోవైపు  కోల్‌కతా నైట్ రైడర్స్ ( KKR ) పలు చెత్త రికార్డులు మూటగట్టుకుంది. ఐపీఎల్‌ చరిత్రలో అతి తక్కువ స్కోర్‌కే.. మొదటి మూడు వికెట్లు కోల్పోయిన జట్ల జాబితాలో కేకేఆర్ చేరింది. పవర్ ప్లే ఓవర్స్ లో అతి తక్కువ స్కోరు చేసిన జట్టు కూడా కేకేఆర్ నే. సిరాజ్ అద్భుత ప్రదర్శనతో కేకేఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 84 పరుగులు మాత్రమే చేయగలిగింది. Also read: Tim Seifert: కోల్‌కతా జట్టులోకి న్యూజిలాండ్ యువ హిట్టర్

 

Trending News