Nirmala Sitharaman: మంత్రాలు, తంత్రాలు నెపంతోనే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్

Nirmala Sitharaman Slams KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి మంత్రాలు, తంత్రాలపై నమ్మకం ఎక్కువని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 9, 2022, 05:39 AM IST
Nirmala Sitharaman: మంత్రాలు, తంత్రాలు నెపంతోనే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్

Nirmala Sitharaman Slams KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి మంత్రాలు, తంత్రాలపై నమ్మకం ఎక్కువని.. తెలంగాణ కేబినెట్‌లో మహిళలు ఉంటే మంచిది కాదని ఎవరో మంత్రగాడు చెబితేనే 2014 నుంచి 2018 వరకు తెలంగాణ కేబినెట్ లోకి మహిళలను తీసుకోలేదని అన్నారు. ఇప్పుడు కూడా మంత్రగాళ్లు చెప్పారనే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చుతున్నట్టు ప్రకటించారని నిర్మలా సీతారామన్ ఎద్దేవా చేశారు. 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పార్టీని ఏర్పాటు చేశామనే చెప్పుకునే కేసీఆర్ ఇవాళ పార్టీ పేరు మార్చడంలో ఆంతర్యమేంటని ఆమె కేసీఆర్‌కి ప్రశ్నలు సంధించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాలతో టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన కేసీఆర్.. తెలంగాణలో అధికారంలోకి వచ్చాకా 3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి ఆ అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రజలపై వేశారని ఆరోపించారు.

ఎవరో మంత్రగాడు చెప్పిన మాటకు విలువిచ్చి సచివాలయానికే వెళ్లకుండా ఫామ్ హౌజ్‌కి, ప్రగతి భవన్‌కి పరిమితమయ్యారని ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రగాళ్ల మాటలు పట్టుకుని టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మారిస్తే.. మరి తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏం కావాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నిలదీశారు. 

కేవలం తెలంగాణ సెంటిమెంట్ వల్లే ప్రజలు ఆ పార్టీని ఎన్నుకున్నారని.. కానీ ఇప్పుడు ఆ సెంటిమెంట్ కూడా లేకుండా టీఆర్ఎస్ పేరులో తెలంగాణను మాయం చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయలేని కేసీఆర్ (CM KCR) జాతీయ రాజకీయాల్లోకి వచ్చి ఇక దేశ ప్రజలకు ఏం చేస్తాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే సరిగ్గా పనిచేయలేని వాళ్లు ఇక దేశానికి ఏదో చేస్తారంటే ఎవ్వరూ నమ్మే పరిస్థితుల్లో లేరని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు.

Also Read : Munugode Bypoll: గతంలో ఉపఎన్నికలే పట్టించుకోలే.. ఇప్పుడు వెయ్యి ఓట్లకు ఇంచార్జ్! కేసీఆర్ కు మునుగోడు భయం పట్టుకుందా?

Also Read : Delhi Liquor Scam: దసరా ముగిసింది.. ఇక కీలక నేత అరెస్టే మిగిలింది! లిక్కర్ స్కాంలో సంచలనం జరగబోతోందా..?

Also Read : Munugode Bypoll: మునుగోడు ఉపసమరంలో మరో ట్విస్ట్.. కోదండరామ్ ఎంట్రీతో మారుతున్న సీన్?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News