Bharatiya Rashtra Samiti: టీఆర్ఎస్ ఇకపై బీఆర్ఎస్.. కేసీఆర్ సంచలన ప్రకటన..

KCR National Party: టీఆర్ఎస్ ను బీఆర్‌ఎస్‌గా మారుస్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం అధికారికంగా ప్రకటించారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 5, 2022, 03:22 PM IST
Bharatiya Rashtra Samiti: టీఆర్ఎస్ ఇకపై బీఆర్ఎస్.. కేసీఆర్ సంచలన ప్రకటన..

KCR National Party Launch Updates: టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మారుస్తూ ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి  సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సహా 283 మంది కీలక ప్రతినిధులు హాజరయ్యారు. టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా (Bharatiya Rashtra Samiti) మారుస్తూ చేసిన తీర్మానంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్నం ఒంటి గంట 19 నిమిషాలకు సంతకం చేశారు. అనంతరం తీర్మానాన్ని ఆయన చదవి వినిపించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి 'భారత్‌ రాష్ట్ర సమితి'గా మారనుంది. పేరు మార్పు విషయమై పార్టీ రాజ్యాంగంలో సవరణ చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు.

అనంతరం కేసీఆర్ ను కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి శుభాకాంక్షలు చెప్పారు. 2001 జలదృశ్యం సభలో అవతరించిన టీఆర్ఎస్.. 21 ఏళ్ల తర్వాత నేడు బీఆర్ఎస్ గా మార్పు చెందింది. జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలని  చూస్తున్న కేసీఆర్ కు పార్టీ పేరు మార్పుతో ముందడుగు వేశారు. ఇప్పటి వరకూ ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్.. ఇక పాన్‌ ఇండియా పార్టీగా అవతరించబోతుంది. టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా మారుస్తూ చేసిన తీర్మానం ప్రతితో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ బృందం గురువారం దిల్లీకి వెళ్లనుంది. ఈ తీర్మానాన్ని కేంద్ర ఎలక్షన్ కమిషన్ కు సమర్పిస్తారు. ఎన్నికల సంఘం దీనిని పరిశీలించి ఆమోదం తెలిపితే అప్పుడు బీఆర్ఎస్ ప్రస్థానం షురూ అవుతుంది. 

Also Read: CM KCR: కేసీఆర్ జాతీయ పార్టీ పేరు ఫిక్స్, ఇవాళే ప్రకటన 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News