Telangana: బీజేపీకు రాజీనామా, సొంతగూటికి చేరిన మాజీ ఎంపీ వివేక్

Telangana: అనుకున్నదే జరిదింది. వివిధ రకాల ఊహాగానాల మధ్య గెడ్డం వివేక్ బీజేపీకు రాజీనామా చేశారు. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 1, 2023, 05:31 PM IST
Telangana: బీజేపీకు రాజీనామా, సొంతగూటికి చేరిన మాజీ ఎంపీ వివేక్

Telangana: తెలంగాణ ఎన్నికల తేదీ సమీపించేకొద్దీ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. పార్టీల మధ్య నేతల జంపింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. వరుసగా ఒక్కొక్కరిగా కీలక నేతలు బీజేపీని వదిలిపెడుతున్నారు. ఇప్పుడు మరో కీలక నేత మాజీ ఎంపీ వివేక్ బీజేపీని వదిలి సొంతగూటికి చేరిపోయారు. 

బీజేపీ నేత, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ బీజేపీ వదిలి సొంతగూటికి అంటే కాంగ్రెస్‌లో చేరనున్నారనే ప్రచారం ఇటీవల ఊపందుకుంది. కానీ ఆ ప్రచారమంతా అవాస్తవమని ఖండించారు వివేక్. పెద్దపల్లి నుంచి బీజేపీ తరపున లోక్‌సభకు పోటీ చేస్తానని ప్రకటించారు. అంతా సద్దుమణిగిందనుకున్నారు. కానీ అనుకున్నదే జరిగింది. ప్రచారం నిజమేని నిరూపించారు. బీజేపీకు రాజీనామా చేసి రాహుల్ గాంధీ సమక్షంలో తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 

వివేక్ వాస్తవానికి మంచి వ్యాపారవేత్త. విశాఖ ఇండస్ట్రీస్ అధినేత. తండ్రి వెంకటస్వామి అలియాస్ కాకా రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు 2004,2009లో వరుసగా రెండుసార్లు పెద్దపల్లి నుంచి ఎంపీగా గెలిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి..2014లో బీఆర్ఎస్ అభ్యర్ధి బాల్క సుమన్ చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత సమీకరణాలు మారడంతో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో బీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో పార్టీని వీడారు. 2019 ఎన్నికల తరువాత బీజేపీలో చేరారు. ఇప్పుడు మళ్లీ బీజేపీకు రాజీనామా చేసి సొంతగూటికి చేరిపోయారు. 

వివేక్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆ పార్టీకు ఆర్ధికంగా, మీడియాపరంగా మంచి బలం కలగనుంది. ఎందుకంటే తెలంగాణలో ప్రభావం చూపిస్తున్న వీ6 ఛానెల్, వెలుగు పత్రిక రెండూ ఆయనవే. వివేక్ తిరిగి సొంతగూటికి రావడం వెనుక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గట్టిగానే ప్రయత్నించినట్టు సమాచారం. వివేక్ కుమారుడు వంశీకు చెన్నూర్ టికెట్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. వివేక్ తిరిగి కాంగ్రెస్‌లో చేరడం వెనుక కొడుకు వంశీ ప్రయత్నం కూడా ఉందంటున్నారు. కొడుకు వంశీకు రాజకీయ భవిష్యత్ అందించేందుకే సొంతగూటికి చేరారనే వార్తలు విన్పిస్తున్నాయి. 

Also read: కాంగ్రెస్ నేతలకు ఎమ్మెల్యే మంచిరెడ్డి వార్నిం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News