డొనాల్డ్ ట్రంప్ సాధించెన్.. అమెరికాలో హిస్టరీ రిపీట్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన తీర్మానం నుంచి విజయవంతంగా గట్టెక్కారు. ఇప్పటివరకూ అమెరికాలో అభిశంసన ద్వారా ఏ అధ్యక్షుడు పదవీచ్యుతుడు కాకపోవడం గమనార్హం.

Last Updated : Feb 6, 2020, 01:08 PM IST
డొనాల్డ్ ట్రంప్ సాధించెన్.. అమెరికాలో హిస్టరీ రిపీట్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌‌ను అధికారం నుంచి తప్పించేందుకు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం సెనేట్‌లో వీగిపోయింది. దీంతో అధ్యక్షుడు ట్రంప్‌నకు పదవీ గండం తప్పింది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, కాంగ్రెస్‌ను అడ్డుకున్నారని ఆరోపిస్తూ అధ్యక్షుడు ట్రంప్‌పై రెండు తీర్మానాలు తీసుకొచ్చారు. ఉక్రెయిన్‌తో చేతులు కలిపి అధికార దుర్వినయోగానికి పాల్పడ్డారని డెమొక్రాట్లు ఆరోపిస్తూ గతేడాది డిసెంబర్‌లో అభిశంసన తీర్మానాన్ని ప్రతిపాదించారు.

అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న తీర్మానాన్ని సెనేట్‌లో ప్రవేశపెట్టగా అనుకూలంగా 48 ఓట్లు, వ్యతిరేకంగా 52 ఓట్లు రావడంతో ట్రంప్ ఊపిరి పీల్చుకున్నారు.  కాంగ్రెస్‌ను అడ్డుకున్నారన్న ఆరోపణల తీర్మానంలో ట్రంప్ విజయం సాధించారు. ఈ తీర్మానంలో వ్యతిరేకంగా 53 ఓట్లు, అనుకూలంగా 47 ఓట్లు వచ్చాయి. దీంతో అభిశంసన తీర్మానంలో 52-48 ఓట్ల తేడాతో, కాంగ్రెస్‌ను అడ్డుకోవడం తీర్మానంలో  53-47 ఓట్ల తేడాతో అమెరికా 45వ అధ్యక్షుడు ట్రంప్ విజయం సాధించారు. అంతకుముందు అభిశంసన తీర్మానం ప్రతిపాదన సెనేట్‌లో తీసుకురాగా అనుకూల ఓట్లు 230, వ్యతిరేకంగా 197 ఓట్లు రావడంతో అభిశంననపై విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది.
Also Read: భారత పర్యటనకు డొనాల్డ్ ట్రంప్.. తీరనున్న అమెరికా అధ్యక్షుడి కోరిక!

వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల తరఫున బరిలోకి దిగననున్న జో బిడెన్‌పై దుష్ప్రచారం చేసి తనకు సాయం చేయాల్సిందిగా ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ఒత్తిడి చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలొచ్చాయి. గత డిసెంబర్ 18న డెమొక్రాట్ల ఆధిపత్యం ఉన్న ప్రతినిధుల సభ అధ్యక్షుడు ట్రంప్‌పై అభిశంసన తీర్మానాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే.

మూడో అధ్యక్షుడు ట్రంప్
అమెరికా చరిత్రలోనే అభిశంసన తీర్మానం ద్వారా ఏ అధ్యక్షుడూ పదవీచ్యుతుడు కాకపోవడం గమనార్హం. అయితే అభిశంసన ఎదుర్కొన్న మూడో అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. గతంలో అండ్రూ జాన్సన్, బిల్ క్లింటన్ (1999) అభిశంసన ఎదుర్కొని విజయం సాధించారు. అభిశంసన ఎదుర్కొన్న తొలి అధ్యక్షుడిగా ఆండ్రూ జాన్సన్ (1868) నిలిచారు.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News