Donald Trump: అమెరికాలో ఉద్యోగాల ఆశలపై నీళ్లు చల్లింది ట్రంప్ సర్కార్. ముఖ్యంగా ఐటీ నిపుణులకు.. భారతీయ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు పెద్ద దెబ్బ కొట్టింది. హెచ్ -బి శాశ్వత పని వీసాల జారీలో విస్తృతంగా జరుగుతున్న అవకతవకలు, మోసాలపై ట్రంప్ ప్రభుత్వం ఒక పెద్ద దర్యాప్తును ప్రారంభించింది. ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్‌పై కూడా దర్యాప్తు జరుగుతోంది.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తనను చంపేందుకు కుట్ర పన్నుతోందని.. వారి నెంబర్ వన్ టార్గెట్ తానే అంటూ ఆరోపించారు. అంకారాలో జరుగుతున్న నాటో సదస్సు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
Donald Trump: కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఇరాన్ అమెరికా మధ్య శాంతి ఒప్పందంతో పరిస్థితులు సద్ధుమణుగుతున్న సమయంలో ట్రంప్ చేసిన కీలక ప్రకటన ఇప్పుడు మరింత ఆందోళనలను రేకెత్తిస్తోంది. హార్మూజ్ జలసంధిలో మళ్లీ సంక్షోభం తలెత్తితే.. దిగుమతులు నిలిచిపోయే ఛాన్స్ ఉంటుంది. దీంతో చమురు ధరలు 85 నుంచి 90 డాలర్లకు పెరిగే అవకాశం ఉంటుంది. దాని ఎఫెక్ట్ తో పెట్రోల్, డీజీల్, సీఎన్జీ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Stock Market Crash: ఇరాన్ తో చర్చలు సమయం వేస్ట్ అన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా ఉద్రిక్తతలకు కారణం అయ్యింది. మిడిల్ ఈస్ట్ లో యుద్ధం చెలరేగుతుందని.. హోర్ముజ్ జలసంధి మళ్లీ మూసివేస్తారన్న ఆందోళనలను పెంచింది. ఈ భయంతో స్టాక్ మార్కెట్ లో భారీ పతనానికి కారణమయ్యింది. ట్రంప్ ప్రకటనతో 9లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది.
What is a red card: ఫిఫా వరల్డ్ కప్ లో అమెరికా ఆటగాడికి రెడ్ కార్డు జారీ చేయడం.. ఆ తర్వాత దాన్ని ఫిఫా క్యాన్సిల్ చేయడంపై వ్యక్తమవుతున్న విమర్శలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమాధానం ఇచ్చారు. ఈ వివాదంలో తాను జోక్యం చేసుకోవడాన్ని సమర్థించుకున్నారు. అసలు ట్రంప్ నకు రెడ్ కార్డ్ అంటే ఏంటో తెలియదట.. మరీ మీకు తెలుసా?
Green Card Holders: అమెరికాలో స్థిర పడిన వారికి అక్కడ ప్రభుత్వం గ్రీన్ కార్డ్ జారీ చేయడం ఎప్పటి నుంచో ఉంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ నిపుణులతో పాటు శాస్త్రవేత్తలు, డాక్టర్లకు సంబంధించి నిపుణులకు అమెరికాలో స్థిరపడేలా అక్కడి ప్రభుత్వం గ్రీన్ కార్డ్ జారీ పేరుతో శాశ్వత సభ్యత్త్వం ఇవ్వడం ఎప్పటి నుంచో ఉంది. గ్రీన్ కార్డ్ వచ్చింది కాదా అని అక్కడఏమైనా పనికి మాలిన వేశాలు వేస్తే అలాంటి వారి గ్రీన్ కార్డ్ ను తక్షణమే రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని అక్కడ అత్యున్నత న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది.
Iran US:అమెరికా-ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్‌లో జరగాల్సిన ఉన్నత స్థాయి శాంతి చర్చలు తాత్కాలికంగా ఆగిపోయాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడులు, హర్మూజ్ జలసంధి వివాదం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఈ చర్చల్లో తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడింది.
Iran US Hormuz: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్ ప్రకటించడంతో మళ్లీ ప్రపంచ దేశాలు ఉలిక్కి పడుతున్నాయి. అయితే ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరినా.. లెబనాన్ పై ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతూ ఉండటంతో ఇరాన్ .. ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
America Attacks Cuba: క్యూబా ఆస్తులు అద్భుతంగా ఉన్నాయి గురూ.. అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి హాట్ టాపిగ్గా మారాయి. క్యూబా యుద్థానికి ట్రంప్ సిద్ధమవుతున్నారా అన్న సందేహాలు మొదలయ్యాయి. వెనిజులాపై తీసుకున్న చర్యల వంటి చర్యలనే క్యూబా కూడా తీసుకునే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ సూచించారు. అది సాధ్యమేనని.. క్యూబా అమెరికాకు చాలా సన్నిహితంగా ఉందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కొత్త ఊహాగానాలకు తెరతీసింది.
US Iran Deal:ఇరాన్–అమెరికా మధ్య అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగిన మరుసటిరోజే పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి. దక్షిణ లెబనాన్‌లోని నబాతియే ప్రాంతంపై ఇజ్రాయెల్ దళాలు భీకర దాడులు జరిపాయి. ఈ దాడుల్లో 16 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు.
Iran US Peace Talks: ఎట్టకేలకు ప్రపంచ ప్రజలు ఏదైతే కోరుకున్నారో అదే జరిగింది. దీర్ఘకాలం యుద్ధం వల్ల నష్టాలే తప్ప.. ఎలాంటి లాభం ఉండని అటు అమెరికాతో పాటు ఇటు ఇరాన్ కూడా అంగీకరించాయి. దీంతో కొన్ని రోజులుగా జరిగిన యుద్ధానికి ముగింపు పలికారు. ఇరు దేశాలు శాంతి ఒప్పందాలపై సంతకాలు చేయడంతో హార్మూజ్‌లో నౌకల ప్రయాణం సాఫీగా సాగిపోతుంది.
America Iran Peace Talks: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం సద్దుమణిగింది. గత కొన్ని రోజులుగా బాంబుల వర్షంతో దద్దరిల్లిన యుద్ధభూమి కుదుటపడనుంది. తాజాగా ఇరాన్ అమెరికాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. దీనికి సంబంధించి డిజిటల్ సంతకాలు పూర్తి అయ్యాయని అమెరికా ప్రకటించింది. ఇరాన్‌తో శాంతి ఒప్పందం పూర్తయ్యిందని, ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి శుక్రవారం నుంచి పూర్తిగా తెరుచుకోనుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా అయిన ట్రూత్‌లో వెల్లడించారు.
Petrol Diesel Price News: పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతకు ఇప్పుడు స్వస్తి పలికారు. ఇరుదేశాల శాంతి ఒప్పందానికి రాగా.. ఈ క్రమంలో ప్రపంచ వాణిజ్యానికి కీలకంగా మారిన హార్మూజ్ జలసంధిని శాశ్వతంగా తెరిచి, ఎలాంటి టోల్ వసూలు చేయకుండా నౌకలను అనుమతించనున్నారు. దీంతో ఇంధన ధరలు భారీగా పడిపోయాయి.
US-Iran Peace Agreement News: అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఆదివారం జరిగిన నిరంతర చర్చల అనంతరం శాంతి ఒప్పందానికి వచ్చాయి. లెబనాన్‌తో సహా అన్ని రంగాలలో సైనిక కార్యకలాపాలను తక్షణమే, శాశ్వతంగా నిలిపేసేందుకు ఇరుపక్షాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ధారించారు.
Gold Price Crash: బంగారం ధరలు గత కొంతకాలంగా భారీగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఉన్నట్టుండిగా ఒక్కసారిగా బంగారం ధరల్లో తిరోగమనం ప్రారంభమైంది. బంగారం ధరలు ఒకసారిగా భారీగా పెరిగాయి. కానీ పెరుగుట విరుగటకే అన్నట్లుగా బంగారం ధరలు మరోసారి ఒక్కసారిగా కుప్పకూలే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు.
Big Shock To Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. రీసెంట్గా ఇరాన్ పై సైనిక చర్యలను నిలిపివేయాలంటూ ప్రతినిధుల సభ ఆమోదం తెలిపడం పెద్ద షాకింగ్ పరిణామంగా నిలిచింది. తాజాగా హెచ్1బీ వీసాల విషయంలో ట్రంప్ సర్కార్‌కు ఫెడరల్ కోర్టులో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.
America Attacks on Iran: ఇరాన్ తో శాంతి చర్చల నేపథ్యంలో అమెరికా మరోసారి ఇరాన్ పై తీవ్రదాడులు చేయడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్‌తో చర్చలు హార్మూజ్ జలసంధి దిగ్భంధనం దగ్గరే ఆగిపోయాయి. తాజాగా బందర్ అబ్బాస్ సహా పలు ప్రాంతాల్లో ఉన్న సైనిక స్థావరాలపై యూస్ వైమానిక దళం విరుచుకుపడింది.
US President Talks on strait of Hormuz: ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తత పరిస్థితులకు ఇంకా ఎండ్ కార్డ్ పడటం లేదు. శాంతి చర్చలు ఈ నేపథ్యంలో ఓ డీల్ కుదిరేవరకు హార్ముజ్ జలసంధిలో ఇరాన్ నౌకల దిగ్బంధం కొనసాగుతుందని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు.
Tulsi Gabbard: అమెరికా జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్ (DNI)గా పనిచేస్తున్న తులసి గబ్బార్డ్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను తన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్నారు. తాను ఈ అత్యున్నత పదవికి రాజీనామా చేయడానికి ప్రధాన కారణం వ్యక్తిగత కారణాలేనని పేర్కొన్నారు. తన భర్త అబ్రహాం అనారోగ్య సమస్యల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.
Crude Oil Price Fall: ఇరాన్ పై దాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాయిదా వేశారన్న వార్త మార్కెట్ సెంటిమెంట్ ను ఒక్కసారి మార్చేసింది. దీంతో ముడి చమురు ధరలు భారీగా తగ్గుతున్నాయి. నేడు మే 19వ తేదీ 2026 మంగళవారం ముడి చమురు ధరలు దాదాపు 2శాతం తగ్గి బ్యారెల్ కు 102.397 డాలర్లకు పడిపోయాయి. అంతేకాదు బ్రెంట్ ముడి చమురు ధరలు 2.57శాతం తగ్గి బ్యారెల్ కు 109.224కు చేరాయి.
Trump:మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు ఘాటు హెచ్చరిక జారీ చేశారు. US - Iran మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
Middle East Tension: అమెరికా మరోసారి ఇరాన్ పై దాడికి ప్రణాళిక రచిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంపై ఉన్నతాధికారులతో చర్చించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇది తుఫానుకు ముందున్న ప్రశాంతత అంటూ ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిగ్గా మారింది.