Leopard Trap Bone At Tirumala: భక్తుల భద్రత విషయంలో రాజీ లేదు.. టీడీడీ ఛైర్మన్ కీలక ప్రకటన

TTD Chiarman Bhumana Karunakar Reddy: తిరుమలలో మరో చిరుతను అధికారులు బంధించారు. అలిపిరి మెట్ల మార్గంలో వరుసగా ఐదో చిరుత బోన్‌లో చిక్కింది. చిరుతను పరిశీలించారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఆపరేషన్ చిరుత కొనసాగుతుందని తెలిపారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 7, 2023, 01:42 PM IST
Leopard Trap Bone At Tirumala: భక్తుల భద్రత విషయంలో రాజీ లేదు.. టీడీడీ ఛైర్మన్ కీలక ప్రకటన

TTD Chiarman Bhumana Karunakar Reddy: అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో వెళ్లే భక్తులకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. భక్తుల భద్రత విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్డు ఏడవ మైలు శ్రీ నరసింహస్వామి ఆలయం సమీపంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కిన చిరుతను గురువారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాత్రి పన్నెండు ఒంటి గంట మధ్య ఈ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో  మరో చిరుత చిక్కిందని తెలిపారు. రెండు నెలల్లో చిక్కిన ఐదవ చిరుత అని చెప్పారు. భక్తులు భద్రత విషయంలో వెనక్కి తగ్గేదిలేదన్నారు. 

అటవీశాఖ అధికారుల సహకారంతో దాదాపు 300 మంది అటవీ సిబ్బంది నిరంతర పర్యవేక్షణలో అలుపెరగకుండా ఆపరేషన్ చిరుత కొనసాగుతుందని తెలిపారు భూమన. భక్తులకు ఎలాంటి  ఇబ్బంది తలెత్తకుండా టీటీడీ ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలో నిరంతర కృషి జరుగుతోందన్నారు. ఈ క్రమంలోనే ఐదో చిరుతను ఈ రోజు పట్టుకున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు ఇద్దరు పిల్లలు  చిరుత పులి దాడికి గురయ్యారని.. అందులో  ఒక పాప మరణించినట్లు తెలిపారు. ఆ తర్వాత మరింత అప్రమత్తతో నడక దారిలో నడుస్తున్న భక్తులను గుంపులు గుంపులుగా ప్రయాణించమని సూచించామని చెప్పారు. వారితో పాటు తోడుగా భద్రత సిబ్బందిని పంపి, ధైర్యాన్ని నింపే ఏర్పాట్లు చేశామన్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే చిన్న పిల్లలు నడిచేందుకు అనుమతిస్తున్నామని తెలిపారు.

"భక్తులలో ఆత్మస్థైర్యాన్ని  నింపడం కోసం నిన్నటి నుంచి చేతి కర్రలు కూడా ఇవ్వడం ప్రారంభించామం. భక్తులకు భద్రతా సిబ్బంది తోడుగా ఇచ్చి, అదనపు భద్రత కల్పిస్తూనే అదనంగా కర్రలు ఇస్తున్నారు. భక్తుల భద్రత విషయంలో  టీటీడీ ఎంతో బాధ్యతాయుతంగా పనిచేస్తుందనడానికి ఇది ఒక ఉదాహరణ. ఆపరేషన్ చిరుత నిరంతరాయంగా కొనసాగుతుంది.." అని టీటీడీ ఛైర్మన్ తెలిపారు.

Also Read: Miss Shetty Mr Polishetty Twitter Review: శెట్టి కాంబో హిట్ కొట్టిందోచ్.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్విట్టర్ టాక్ ఇదే..!   

Also Read: Shri Krishna Janmashtami 2023: శ్రీకృష్ణుడి వీడ్కోలు తరువాత తల్లిదండ్రులకు ఏమయ్యారు..? ఆ నలుగురు ఎలా చనిపోయారు..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News