Miss Shetty Mr Polishetty Twitter Review: శెట్టి కాంబో హిట్ కొట్టిందోచ్.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్విట్టర్ టాక్ ఇదే..!

Miss Shetty Mr Polishetty Movie Review and Public Talk: జాతిరత్నాలు వంటి బ్లాక్‌బస్టర్ తరువాత నవీన్ పోలిశెట్టి.. బిగ్‌స్క్రీన్‌పై చాలా కాలం తరువాత రీఎంట్రీ ఇస్తున్న అనుష్క శెట్టి.. వీరి కాంబోలో వచ్చిన మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. భారీ అంచనాల మధ్య ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..?  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 7, 2023, 07:56 AM IST
Miss Shetty Mr Polishetty Twitter Review: శెట్టి కాంబో హిట్ కొట్టిందోచ్.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్విట్టర్ టాక్ ఇదే..!

 Miss Shetty Mr Polishetty Movie Review and Public Talk: అనుష్క శెట్టి-నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ అనగానే ఆడియన్స్‌కు ఆసక్తి క్రియేట్ అయింది. అందుకు తగినట్లే 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' అంటు గమ్మతైన టైటిల్ పెట్టారు. మహేష్ బాబు పి. డైరెక్షన్‌లో రూపిందిన ఈ వైవిధ్యభరితమైన ప్రేమకథను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మించారు. మురళీశర్మ, అభినవ్ గోమటం, తులసి, సోనియా కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజ్ టీజర్, ట్రైలర్ మూవీ అంచనాలను పెంచేసింది. పెళ్లి కాకుండా పిల్లలను కనాలనుకునే మిస్ శెట్టి ప్రేమలో పడిన మిస్టర్ పోలిశెట్టి జీవితం ఎలాంటి మలుపు తిరిగిందనేది కథ. ఈ మూవీని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. నేటి (సెప్టెంబర్ 7) నుంచి థియేటర్స్‌లో సందడి మొదలుపెట్టింది. మరి ఆడియన్స్ అంచనాలను శెట్టి జోడి అందుకుంటుందా..? ట్విట్టర్ రివ్యూ టాక్ ఎలా ఉంది..? ఇప్పటికే ప్రీమియర్ షోలు చూసిన వారి రివ్యూలు ఎలా ఉన్నాయి..? ఓ లుక్కేద్దాం పదండి..

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ టాక్ వస్తోంది. క్లీన్ కామెడీ ఎంటర్‌టైనర్ అని మెచ్చుకుంటున్నారు. నవీన్-అనుష్క జోడీ సూపర్ సెట్ అయింది. నవీన్ పోలిశెట్టి సినిమాను అన్నీ తానై నటించాడు. కామెడీ, సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ అయిందని రివ్యూలు ఇస్తున్నారు. సూపర్ హిట్‌తో అనుష్క కమ్‌బ్యాక్ ఇచ్చిందని.. నవీన్ పోలిశెట్టి ఖాతాలో హ్యాట్రిక్ హిట్ చేరిందని అంటున్నారు. నవీన్ కామెడీ టైమింగ్ అదిరిపోయిందని.. సెంటిమెంట్స్ సీన్స్‌లో ఎమోషన్స్ బాగా పండాయని చెబుతున్నారు. క్లైమాక్స్ సూపర్ ఉందని అభినందిస్తున్నారు. 

 

 

నవీన్ పోలిశెట్టి వన్ మ్యాన్‌ షో అని అంటున్నారు. సినిమా చూస్తున్నంతసేపు చాలా బాగా ఎంజాయ్ చేశానని.. కామెడీ హిలేరియస్‌గా ఉందని ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. కాన్సెప్ట్ అదిరిపోయిందని.. కామెడీ, ఎమోషన్స్ బాగా కనెక్ట్ అవుతాయని రివ్యూలు ఇస్తున్నారు. ఓవరాల్‌గా సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అని.. మూవీలో ఎక్కడా బోర్ కొట్టదంటున్నారు. హీరోయిన్ క్యారెక్టర్ అద్బుతంగా డిజైన్ చేశారని.. క్లైమాక్స్ చాలా మెచ్యూర్డ్‌గా చూపించారని కితాబిస్తున్నారు.

 

నవీన్ పోలిశెట్టి నేమ్.. కామెడీ అతడి గేమ్ అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్క్రీన్‌ప్లే చాలా బాగుందని.. ఒక్క నిమిషం కూడా నిరాశ చెందకుండా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారని ఆడియన్స్ అంటున్నారు. అవకాయ ముద్దలాంటి అద్భుతమైన మూవీ అని మరో నెటిజన్ పోస్ట్ చేశాడు. ప్రేక్షకులకు ఫ్రెష్‌ కాన్సెప్ట్ అందించారని.. చివరి 30 నిమిషాలు హార్ట్ టచ్చింగ్ సీన్స్ ఉన్నాయని చెబుతున్నారు. బ్యూటీఫుల్ మూవీ అని.. కథ చాలా బాగా రాశారని మెచ్చుకుంటున్నారు.

 

సింగిల్ హ్యాండ్‌తో నవీన్ పోలిశెట్టి ఎంటర్‌టైన్ చేశాడని.. అనుష్క శెట్టి లుక్స్ క్యూట్ అండ్ ఎక్స్‌లెంట్ అంటూ కాంప్లీమెంట్స్ ఇస్తున్నారు నెటిజన్లు. కామెడీ చాలా బాగుందని.. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిందంటున్నారు. సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుందని.. ఎన్నో రోజుల తరువాత సూపర్ హిట్ కామెడీ డ్రామా అని రివ్యూలు ఇస్తున్నారు. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'కి పాజిటివ్ టాక్స్‌ వస్తుండడంతో మూవీ టీమ్ ఫుల్ జోష్‌లో ఉంది. ఇప్పటికే యూఎస్‌లో ఉన్న నవీన్ పోలిశెట్టి.. అక్కడ ఆడియన్స్‌తో సినిమా చూస్తూ ప్రమోషన్స్ చేస్తున్నాడు. 

 

 

Trending News