Corona Third Wave: 5 ఏళ్లలోపు చిన్నారులకు Face Masks అక్కర్లేదు, DGHS సూచన

Face Masks For Children: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలో విభాగమైన డీజీహెచ్ఎస్ అయిదేళ్ల వరకు చిన్నారులు మాస్కులు ధరించాల్సిన పనిలేదంటోంది. చిన్నారులకు సంబంధించిన పలు కీలక సూచనలు చేసింది.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 10, 2021, 03:21 PM IST
  • కరోనా థర్డ్ వేవ్ చిన్నారులకు ప్రమాదమని తల్లిదండ్రులలో భయాలు, ఆపోహలు
  • కానీ చిన్నారులకు ప్రమాదకరమని ఎలాంటి నివేదికలు వెల్లడించలేదు
  • 5 ఏళ్లలోపు చిన్నారులకు మాస్కులు అక్కర్లేదు అని చెప్పిన డీజీహెచ్ఎస్
Corona Third Wave: 5 ఏళ్లలోపు చిన్నారులకు Face Masks అక్కర్లేదు, DGHS సూచన

Corona Third Wave: కరోనా థర్డ్ వేవ్ చిన్నారులకు ప్రమాదమని, పసిపిల్లలు కరోనా బారిన పడతారని ప్రచారం జరిగినా, అందుకు సంబంధించిన నివేదికలు లేవు. అయిదేళ్లలోపు చిన్నారులకు మాస్కులు అవసరం లేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తెలిపింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలో విభాగమైన డీజీహెచ్ఎస్ అయిదేళ్ల వరకు చిన్నారులు మాస్కులు ధరించాల్సిన పనిలేదంటోంది.

ఆరు నుంచి 11 ఏళ్ల వయసు చిన్నారులు మాత్రం కచ్చితంగా ముఖానికి మాస్కులు ధరించాలని Corona Third Wave ఆందోళనల నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ స్పష్టం చేసింది. అయితే డాక్టర్లను సంప్రదించిన తరువాత, తల్లిదండ్రుల సమక్షంలో 6 నుంచి 11 ఏళ్ల చిన్నారులు మాస్కులు ధరించాల్సి ఉంటుందని ఏఎన్‌ఐ మీడియా రిపోర్ట్ చేసింది. 18 ఏళ్లలోపు వారికి సంబంధించి డీజీహెచ్ఎస్ సరికొత్త సూచనలు చేసింది. చిన్నారులకు రెమిడెసివర్ వినియోగించకూడదని, హెచ్‌ఆర్‌సీటీ ఇమేజింగ్‌ చేయవచ్చునని పేర్కొంది.  

Also Read: COVID-19 Infections: కరోనా వ్యాక్సిన్ల ప్రభావంపై సర్వేలో సీడీసీ ఆసక్తికర విషయాలు

స్వల్ప లక్షణాలు లేదా లక్షణాలు లేకుండా కరోనా సోకిన వారికి స్టెరాయిడ్స్ వాడవద్దని మార్గదర్శకాలలో సూచించింది. కోవిడ్19 (Covid-19 Variants) ప్రభావం అధికంగా ఉండి ఆసుపత్రిలో చేరి, పరిస్థితి విషమంగా ఉన్నవారికి స్టెరాయిడ్స్ వాడవచ్చునని సూచించింది. కేవలం సరైన సమయంలో, అవసరాన్ని బట్టి మాత్రమే వినియోగించాలని, రెమిడెసివర్‌ను చిన్నారులను ఉపయోగించకూడదని చెప్పింది. ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్, పనితీరును తెలుసుకునేందుకు High-resolution CTని చేయడానికి అనుమతి ఇచ్చింది. 

Also Read: Telangana lockdown timings: తెలంగాణ లాక్‌డౌన్ టైమింగ్స్‌లో సడలింపులు

18 ఏళ్లలోపు కరోనా బాధితులలో రెమిడెసివర్ వాడకం వల్ల ఆశించిన మేర ప్రయోజనం ఉన్నట్లు కనిపించడం లేదని పేర్కొంది. స్వల్ప కరోనా లక్షణాలున్న వారికి యాంటీమైక్రోబయల్స్ వాడకూడదని సూచించింది.  స్వల్ప లక్షణాలున్న చిన్నారులకు ప్రతి 4 నుంచి 6 గంటలకు జ్వరం తగ్గడానికి 10 నుంచి 15 మిల్లీగ్రామ్ డోసు Paracetamol ట్యాబ్లెట్ ఇవ్వాలి. డాక్టర్లు సూచించిన ఇతర ట్యాబ్లెట్లు వాడాల్సి ఉంటుంది. Asymptomatic చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు మాస్కు ధరించడం, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడమే పరిష్కార మార్గమని DGHS సూచించింది.

Also Read: India Corona Update: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, లాక్‌డౌన్ ఆంక్షల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News