కరోనా వైరస్ టీకాలు తీసుకోవాలా వద్దా అనే అంశంపై దాదాపు అందరికీ అనుమానాలు తొలగిపోయాయి. అయినా కోవిడ్19 టీకాల ప్రభావంపై సందేహాలు లేవనెత్తే వారు అక్కడక్కడా ఉంటారు. అమెరికాకు చెందిన యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మంగళవారం విడుదల చేసిన రిపోర్టు చదివితే కరోనా టీకాలపై అనుమానాలు పటాపంచలు అవుతాయి.
కరోనా వ్యాక్సిన్ తొలి టీకా తీసుకున్నవారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, కొన్ని రకాల ఇన్ఫెక్షన్లను సైతం ఎదుర్కొనేలా మీ శరీరం సిద్ధమవుతుందని సీడీపీ తన రిపోర్టులో పేర్కొంది. కోవిడ్19 వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిని పరిశీలిస్తే ఇన్ఫెక్షన్ (Covid-19 Symptoms) సోకే అవకాశం వీరికి 0.01 శాతం ఉంటుందని శుభవార్త అందించింది. రెండు డోసుల టీకా తీసుకున్న వారు కరోనా బారిన పడితే వీరికి కోవిడ్19 నిర్దారణ పరీక్షలలో ఏ లక్షణాలు లేవు (Asymptomatic) అని తెలిపింది. ఫైజర్ వ్యాక్సిన్, మోడెర్నా వ్యాక్సిన్, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లు రెండు డోసులు తీసుకున్న వారిని 14 రోజుల అనంతరం సీడీసీ పరీక్షించింది.
Also Read: Lunar Eclipse 2021 Date, Timings: చంద్రగ్రహణం టైమింగ్స్, భారత్‌లో ఎవరు వీక్షించవచ్చు
అమెరికాలో 101 మిలియన్ల మందికి ఏప్రిల్ నాటికి విజయవంతంగా రెండు డోసులు ఇవ్వగా, అందులో 10,262 మంది కరోనా సోకగా, స్వల్ప లక్షణాలు, Asymptomatic అని గుర్తించినట్లు సీడీసీ తన రిపోర్టులో పేర్కొంది. వీరి సగటు వయసు 58 అని అయినా కరోనావైరస్ (CoronaVirus) ప్రభావం వీరిపై కనిపించలేదని చెబుతూ కరోనా టీకాలపై అపోహల్ని మరోసారి తొలగించింది. వంద మిలియన్లలో కేవలం 10 శాతం మంది ఆసుపత్రిలో చేరి చికిత్స పొంది కోలుకున్నారని స్పష్టం చేసింది.
Also Read: Lunar Eclipse 2021: చంద్ర గ్రహణం ఈ రాశుల వారిపై ప్రభావం చూపుతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook